Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో చార్జీషీట్ దాఖలు

డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని తెలిపింది. నివేదిక వచ్చాక కోర్టుకు సమర్పిస్తామని సీబీఐ అధికారులు వెల్లడించారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో చార్జీషీట్ దాఖలు

Delhi Liquor Scam

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ మరో చార్జీషీట్ దాఖలు చేసింది. 209 పేజీలతో రెండో అనుబంధ చార్జీషీట్ దాఖలు చేసింది. మనీశ్ సిసోడియా, బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమన్ దీప్ సింగ్ ను నిందితులుగా పేర్కొంటూ సీబీఐ మరో చార్జిషీట్ దాఖలు చేసింది. వివిధ సెక్షన్ల కింద నిందితులపై అభియోగాలు నమోదు చేసింది.

నాటి ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణతోపాటు మరో నలుగురిని అనుమానితులుగా సీబీఐ పేర్కొంది. ఏ-11గా ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ పేర్కొంది. అయితే, ఇదివరకే బుచ్చిబాబుకు స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అర్జున్ పాండేను ఇంకా అరెస్టు చేయాల్సివుందని సీబీఐ పేర్కొంది.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. వైసీపీ ఎంపీ కుమారుడికి ఎదురుదెబ్బ

డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని తెలిపింది. నివేదిక వచ్చాక కోర్టుకు సమర్పిస్తామని సీబీఐ అధికారులు వెల్లడించారు. చార్జీషీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై మే 12న విచారణ జరుగనుంది.