Monthly Family Pension : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలవారీ పెన్షన్ పెరిగింది!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ (Family Pension) పెంచుతూ సర్కారు నిర్ణయించింది. ఫ్యామిలీ పెన్షన్ల నెలవారీ గరిష్ట పరిమితిని మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Monthly Family Pension : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలవారీ పెన్షన్ పెరిగింది!

One Can Get Rs 1.25 Lakh Monthly Family Pension

Monthly Family Pension : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ (Family Pension) పెంచుతూ సర్కారు నిర్ణయించింది. ఫ్యామిలీ పెన్షన్ల నెలవారీ గరిష్ట పరిమితిని మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న రూ.45వేలు ఉన్న పరిమితిని రూ.1,25,000కు పెంచింది. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులై ఉండి.. మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు వారిద్దరి పెన్షన్ పొందవచ్చు. 50శాతం గరిష్టంగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పెన్షన్ లిమిట్ నెలకు రూ.45 వేలు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈ లిమిట్‌ను పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది.

ఇప్పటి నుంచి కేంద్ర ఉద్యోగుల పెన్షన్‌ను నెలకు గరిష్టంగా రూ.1.25 లక్షలు అందిస్తామని పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ శాఖ వెల్లడించింది. ఈ మొత్తానికి డీఆర్ సమయానుగుణంగా అందించనుంది. ఇందులో భాగంగానే కుటుంబ పెన్షన్లకు సంబంధించి 75 ప్రధాన కొత్త రూల్స్‌ ప్రవేశపెట్టినట్టు పేర్కొంది. పెన్షన్ తీసుకునే వృద్ధుల్లో అవగాహన కోసమే ఈ కొత్త రూల్స్‌ను తీసుకొచ్చినట్లు వెల్లడించింది.

నెలకు కనిష్టం మొత్తంగా రూ.9 వేల వరకు పెన్షన్ అందుకోవచ్చు. కూడా డీఆర్ అదనంగా జత చేయనుంది. గతంలో నిబంధనల మేరకు ఇద్దరు కుటుంబ సభ్యుల పెన్షన్లు నెలకు 45వేలు, 27వేలకు మించకూడదు. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుమారుడు లేదా కుమార్తె నెలకు 2,50,000 పెన్షన్ పొందవచ్చు. డిపార్ట్ మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ ఫేర్ ఈ వివరాలను షేర్ చేసింది.