Chandrayaan-3: చంద్రయాన్‌-3లోని ల్యాండర్, రోవర్‌పై కీలక ప్రకటన చేసిన ఇస్రో

ల్యాండర్, రోవర్ తిరిగి యాక్టివ్ అయ్యాయా? అన్న విషయంపై ఇస్రో ఇవాళ సాయంత్రం స్పందించింది. 

Chandrayaan-3: చంద్రయాన్‌-3లోని ల్యాండర్, రోవర్‌పై కీలక ప్రకటన చేసిన ఇస్రో

Vikram lander Pragyan rover

Chandrayaan-3 ISRO: తిరుపతి జిల్లా శ్రీహరికోట(Sriharikota)లోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (Satish Dhawan Space Centre) నుంచి ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3లోని ల్యాండర్, రోవర్ 14 రోజులుగా స్లీప్ మోడ్ లో ఉన్నాయి. ఇవాళ జాబిల్లిపై మళ్లీ సూర్యుడి వెలుగు పడడంతో ల్యాండర్, రోవర్ మళ్లీ మేల్కొనే అవకాశం ఉంది. ఇస్రో నుంచి దీనిపై అప్ డేట్ కోసం చాలా మంది ఆత్రుతగా ఎదురుచూశారు.

ల్యాండర్, రోవర్ తిరిగి యాక్టివ్ అయ్యాయా? అన్న విషయంపై ఇస్రో ఇవాళ సాయంత్రం స్పందించింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ మళ్లీ మేల్కొన్నాయా? (యాక్టివ్ అయ్యాయా?) అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఇస్రో తెలిపింది.

ల్యాండర్, రోవర్ తో కమ్యూనికేషన్ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పింది. ఇప్పటివరకైతే తాము ఇందుకు సంబంధించి ఎలాంటి సిగ్నల్స్ నూ అందుకోలేదని పేర్కొంది. తమ ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పింది.

కాగా, ల్యాండర్, రోవర్లను తిరిగి మేల్కొలిపేందుకు (యాక్టివేట్ చేసేందుకు) ప్రయత్నిస్తామని ఇస్రో కొన్ని రోజులుగా చెబుతోంది. నిజానికి వాటి జీవిత కాలం 14 రోజులే. అదృష్టం కలిసి వస్తే మళ్లీ యాక్టివేట్ అవుతాయి. ఇప్పటికే చంద్రుడికి సంబంధించిన కీలక సమాచారాన్ని అవి అందించాయి.

Reliance Jio Offers : ఆపిల్ ఐఫోన్ 15 కొనుగోలుపై జియో ఆఫర్లు.. 6 నెలల ఫ్రీపెయిడ్ ప్లాన్ ఉచితం.. ఈ ఆఫర్ మళ్లీ రాదు.. డోంట్ మిస్!