Inspiration : టెన్త్ థర్డ్ క్లాస్‌లో పాస్, అయినా ఐఏఎస్ అధికారి అయ్యాడు

చత్తీస్‍‌గఢ్ కేడరుకు చెందిన 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఒకరు తన 10వ తపరగతి మార్కుల లిస్టును  ఇటీవల  సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇప్పుడ చాలా మందికి ఇన్స్పిరేషన్  కలిగిస్తోంది.

Inspiration : టెన్త్ థర్డ్ క్లాస్‌లో పాస్, అయినా ఐఏఎస్ అధికారి అయ్యాడు

Awanish Sharan

Inspiration : చత్తీస్‍‌గఢ్ కేడరుకు చెందిన 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఒకరు తన 10వ తపరగతి మార్కుల లిస్టును  ఇటీవల  సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇప్పుడ చాలా మందికి ఇన్స్పిరేషన్  కలిగిస్తోంది.  అవనీష్ శరణ్ అనే ఐఏఎస్ అధికారి 1996లో బీహార్ స్కూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయినప్పుడు 700 మార్కులకు గానూ 314 మార్కులు సాధించి 44.85 శాతంతో థర్డ్ క్లాస్ లో పాసయ్యాడు.

ఇది నెటిజన్లను ఆకర్షించింది. టెన్త్ క్లాస్ మూడో డివిజన్ లోఉత్తీర్ణత సాధించినా   ఐఏఎస్ సాధించటం పలువురిలో స్పూర్తిని నింపింది. 10వ తరగతి మార్కుల లిస్టు కేవలం కాగితం ముక్క మాత్రమే   అయినా అది మీ భవిష్యత్తను నిర్వచించిందని   అన్నారు. కొన్ని సార్లు తక్కువ మార్కులు సాధించిన వ్యక్తులు కూడా జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారు అని కొందరు వ్యాఖ్యానించారు.

అవనీష్ శరణ్ తన మార్కుల షీటు ను జులై 6న సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పటి వరకు సుమారు 31,000 కంటే ఎక్కువ లైకులు, 3,060 రీట్వీట్ లు వచ్చాయి. అతను 10వ తరగతిలో తక్కువ  మార్కులు సాధించినా ఐఏఎస్ అధికారి అయ్యేలా చేసిందని ఒక నెటిజన్ చేసిన వ్యాఖ్య మరోక నెటిజన్ మళ్లీ UPSC పరీక్షకు సిధ్దపడేలా చేసింది.

సార్ మీరు నాకు ఎంత స్పూర్తిని ఇచ్చారో మీరు నమ్మరు. నాకూ టెన్త్ లో 314 మార్కులు వచ్చి థర్డ్ క్లాస్ లో పాసయ్యాను. అయితే UPSC లో టాపర్స్ మాత్రమే ఉత్తీర్ణులవుతారనే నా ఆలోచన మార్చుకున్నానని తెలిపాడు.  నేను మళ్లీ సివిల్స్ కుప్రిపేర్ అవుతాను అని ఆ నెటిజన్ తెలిపాడు.  మీ మార్కలు లిస్టు పోస్టు చేసినందుకు ధన్యావాదాలు అని  తెలిపాడు. వివిధ పోటీ పరీక్షలకు సిధ్దమవుతున్న విద్యార్ధులకు ఇది గొప్ప ప్రేరణ.. సంకల్పం ఉన్నచోట ఒక మార్గం ఉంటుందని మరోక నెటిజన్ కోట్ చేశాడు.

Also Read : bihar: ‘నేను దేవ‌త‌ను.. నా భ‌ర్త‌ను విడిచిపెట్ట‌క‌పోయారో’ అంటూ పోలీసుల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టిన‌ మ‌హిళ