Vehicle Theft: దేశంలో ఎక్కువ వాహన దొంగతనాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా..? సేఫ్‌‌ప్లేస్‌లో హైదరాబాద్‌

హైదరాబాద్‌లోనూ వాహన చోరీ కేసులు తరచూ నమోదవుతుంటాయి. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ సేఫ్‌ప్లేస్‌లో ఉన్నట్లేనని చెప్పొచ్చు. దేశంలో ప్రధాన నగరాలైన బెంగళూరు(9శాతం), చెన్నైలో(5శాతం) వాహన దొంగతనాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, ముంబై, కోల్ కతా వంటి నగరాల్లోనూ తక్కువ వాహన దొంగతనాలు జరుగుతున్నట్లు తాజా నివేదిక తెలిపింది.

Vehicle Theft: దేశంలో ఎక్కువ వాహన దొంగతనాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా..? సేఫ్‌‌ప్లేస్‌లో హైదరాబాద్‌

Vehicle Theft

Vehicle Theft: భారతదేశంలో అనేక రకాల దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిల్లో ముఖ్యంగా వాహన దొంగతనాలు కూడా ఉన్నాయి. ఈ తరహా దొంగతనాలు దేశంలో ఎక్కువే అని చెప్పాలి. అసలు దేశంలో వాహనాల దొంగతనాలు ఎక్కువగా ఏ ప్రాంతంలో జరుగుతున్నాయో తెలుసుకొనేందుకే ఏసీకేఓ ఇన్సూరెన్స్ కంపెనీ దేశవ్యాప్తంగా అధ్యయనం చేసి ఓ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా వాహన దొంగతనాలు జరుగుతున్నాయని తేల్చింది. హైదరాబాద్ నగరం మాత్రం ఈ విషయంలో స్లేఫ్‌ప్లేస్‌లో ఉంది.

Cyber Criminals Fraud : పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం.. రూ.కోటి 33 లక్షలు కొట్టేశారు

నివేదిక తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో అత్యధికంగా ఢిల్లీలో 56శాతం వాహన చోరీలు జరుగుతున్నాయి. అంటే ప్రతీ 12 నిమిషాలకు అక్కడ ఒక వాహనం చోరీకి గురవుతుంది. ఢిల్లీ పోలీసుల సమాచారం ప్రకారం.. 2011 నుంచి 2020 సంవత్సరాల కాలంలో కేవలం ఒక్క ఢిల్లీలోనే మూడు లక్షల వాహనాలు చోరీకి గురవగా,అక్కడ నమోదవుతున్న కేసుల్లో 20శాతం వాహన చోరీకి సంబంధించినవే కావటం గమనార్హం. ఎక్కువగా వాగన్ ఆర్, స్విఫ్ట్ డిజైర్ మోడల్ కార్లు చోరీకి పాల్పడుతున్నారు. బైకుల విషయంలో హోందా, హీరో, బజాజ్, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలకు చెందిన బైకులు ఎక్కువగా చోరీకి గురవుతున్నాయని నివేదిక పేర్కొంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.