UP : యూపీలో మత కార్యక్రమాలకు ‘అఫిడవిట్’ తప్పనిసరి చేసిన యోగి ప్రభుత్వం

యూపీలో మత కార్యక్రమాలకు ‘అఫిడవిట్’ తప్పనిసరి చేసింది సీఎం యోగి ప్రభుత్వం.

UP : యూపీలో మత కార్యక్రమాలకు ‘అఫిడవిట్’ తప్పనిసరి చేసిన యోగి ప్రభుత్వం

Organisers Affidavit Must For Religious Processions Up Cm

Updated On : April 19, 2022 / 1:15 PM IST

UP : ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మతపరమైన కార్యక్రమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మతపరంగా సమావేశాలు నిర్వహించాలన్నా..ఊరేగింపులు చేసుకోవాలన్నా ‘అఫిడవిట్’ తప్పనిసరి చేసింది. సమావేశాలు, ఊరేగింపులు జరుపుకోవాలనంటే నిర్వాహకుల నుంచి తప్పనిసరిగా అఫిడవిట్ (ప్రమాణపత్రం) తీసుకోవాలని ఆదేశించింది. ఢిల్లీలో హన్ మాన్ శోభా యాత్ర చేస్తున్న వారిపై దాడులు జరిగిన క్రమంలో యూపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం (ఏప్రిల్ 18,2022) ఉన్నతాధికారులతో సీఎం యోగి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ నిర్ణయిం తీసుకుని ఆదేశాలు జారీ చేశారు.

Also read : Sailajanath : ఏపీలో పాదయాత్ర చేపట్టనున్న శైలజానాథ్

రంజాన్, అక్షయ తృతీయ ఒకే రోజు రావటంతో మతపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ‘‘ఇటువంటి కార్యక్రమాలకు అనుమతి ఇచ్చే ముందే శాంతి, సామరస్యాన్ని కాపాడుతామంటూ నిర్వాహకుల నుంచి అఫిడవిట్ తప్పకుండా తీసుకోవాలి. సంప్రదాయంగా వస్తున్న మతపరమైన కార్యక్రమాలకే అనుమతి ఇవ్వండి. కొత్త కార్యక్రమాలకు అనుమతులు వద్దు’’ అని యోగి ఆదేశించారు.

Also read : AP : అధిష్టానంపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్..‘నన్ను ఒకవైపే చూసారు..రెండో వైపు చూస్తే తట్టుకోలేరు..నేనేంటో చూపిస్తా’..

రానున్న పండుగల సందర్భంగా శాంతియుత వాతావరణానికి వీలుగా తమ పరిధిలోని మత నేతలు, ప్రముఖులతో వచ్చే 24 గంటల్లో చర్చలు నిర్వహించాలని డైరెక్టర్ జనరల్ నుంచి స్టేషన్ హౌస్ అధికారుల వరకు అందరికీ ఆదేశాలు జారీ చేశారు. సామరస్యాన్ని దెబ్బతీసే ప్రకటనలు చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అలాగే మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం కలుగ కుండా చూసుకోవాలని ఆదేశించారు.