Cognizant Hire : కాగ్నిజెంట్‌లో కొలువుల జాతర, లక్ష ఉద్యోగాలు భర్తీ

అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ కొలువల జాతరకు తెరలేపింది. ఈ ఏడాది సుమారు లక్ష మందిని..

Cognizant Hire : కాగ్నిజెంట్‌లో కొలువుల జాతర, లక్ష ఉద్యోగాలు భర్తీ

Cognizant Hire

Cognizant Hire : అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ కొలువల జాతరకు తెరలేపింది. ఈ ఏడాది సుమారు లక్ష మందిని ఒప్పంద ఉద్యోగులుగా నియమించుకోవాలని భావిస్తోంది. సంస్థలో అట్రిషన్‌ రేటు అధికంగా ఉంది. దీంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ ఏడాది 30వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలను కల్పించనుంది. 2022 ఏడాదిలో భారత్ లో ఫ్రెషర్‌లకు 45వేల ఆఫర్లను అందించాలని భావిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

కాగ్నిజెంట్‌కు ఇదొక అసాధారణమైన త్రైమాసికమనీ, అనేక సవాళ్ల మధ్య ముఖ్యంగా కోవిడ్-19 సంక్షోభంలో కూడా రెండవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 15శాతం ఎగిసి 4.6 బిలియన్ డాలర్లకు పెరిగిందనీ, 2015 నుండి ఇదే అత్యధిక త్రైమాసిక ఆదాయమని డిజిటల్ బిజినెస్ అండ్‌ టెక్నాలజీ
ప్రెసిడెంట్, కాగ్నిజెంట్ ఛైర్మన్ రాజేష్ అబ్రహం తెలిపారు. కొత్త డిజిటల్ నైపుణ్యాలలో సుమారు 95వేల మందికి శిక్షణ ఇచ్చా‍మన్నారు. 2021లో అత్యధికంగా క్యాంపస్ నియామకాల కింద 30 వేల మందిని, 2022లో ఆన్‌బోర్డింగ్‌ కింద 45 వేల గ్రాడ్యుయేట్లకు ఆఫర్స్‌ ఇస్తామన్నారు. అలాగే ఈ
ఏడాది సుమారు లక్షమందిని నియమించుకోనున్నట్టు తెలిపారు.

తాజా అంచనాల ప్రకారం బీపీవో, ఐటీ సర్వీసుల్లో జూన్ త్రైమాసికం ముగిసే సమయానికి ట్రైనీలు, కార్పొరేట్ ఉద్యోగులు 3 లక్షలమంది సంస్థకు గుడ్‌బై చెప్పారు. ఈ కారణంగానే అట్రిషన్‌ను తగ్గించుకోవడంతోపాటు, కాంపెన్‌సేషన్‌, సర్దుబాట్లు, నైపుణ్యాల మెరుగుదల, ప్రమోషన్లపై దృష్టి పెట్టినట్టు కాగ్నిజెంట్ సీఈఓ బ్రియాన్ హంఫ్రీస్ చెప్పారు. దాదాపు లక్షమందిని కాంట్రాక్ట్‌ విధానంలో నియమించుకోవడంతోపాటు, 2021 లో మరో లక్షమంది అసోసియేట్లకు శిక్షణా కార్యక్రమాలను చేపడతామని చెప్పారు.