Udaipur Chintan Shivir : నేటి నుంచి కాంగ్రెస్ చింతన్ శివిర్.. ట్రైన్లో ఉదయ్‌పూర్‌కు రాహుల్..
Udaipur Chintan Shivir : వరుస ఎన్నికల్లో పరాజయాల నుంచి తేరుకుని విజయాల దిశగా అడుగులు వేసేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైంది. నేటి (శుక్రవారం) నుంచి మూడు రోజుల పాటుకాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శివిర్ నిర్వహించనుంది.

Udaipur Chintan Shivir : వరుస ఎన్నికల్లో పరాజయాల నుంచి తేరుకుని విజయాల దిశగా అడుగులు వేసేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైంది. నేటి (శుక్రవారం) నుంచి మూడు రోజుల పాటుకాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శివిర్ నిర్వహించనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ కాంగ్రెస్ చింతన్ శివిర్ సమావేశాలు జరగనున్నాయి. కాంగ్రెస్ కీలక నేతలంతా ఉదయపూర్ చేరుకున్నారు. కాంగ్రస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా 75 మంది కీలక నేతలు ఢిల్లీ నుంచి ఉదయ్‌పూర్‌కు రైలులో ప్రయాణించారు. సోనియాగాంధీ నేతృత్వంలో జరిగే చింతన్ శివిర్‌కు దేశ వ్యాప్తంగా 430మంది కాంగ్రెస్ నేతలు హాజరు అవుతున్నారు.
పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యలపై ఆందోళన, భవిష్యత్ కార్యాచరణతోపాటు అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి పలు అంశాలపై ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత చింతన్ శివిర్ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారు.

Congress’ 3 Day Brainstorming In Udaipur From May 13 For New Roadmap
దేశవ్యాప్తంగా తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ వ్యవస్థాగత బలోపేతం, రైతు సమస్యలు, నిరుద్యోగం తదితర అంశాలపై కాంగ్రెస్ కీలక నేతలు చర్చించే అవకాశం ఉంది. ఆర్థిక, సామాజిక అంశాలపై విస్తృతంగా కూడా చర్చించనున్నారు. రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా సోనియాగాంధీ ఆహ్వానం మేరకు నేతలంతా కాంగ్రెస్ చింతన్ శివిర్ సదస్సుకు హాజరుకానున్నారు. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌తో కాంగ్రెస్ ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
Read Also : Rahul Gandhi: భారత్‌ను రెండు రకాలు చేశారు ధనికులకొకటి, పేదలకొకటి: ప్రధానిపై రాహుల్ విమర్శలు
- Rahul Gandhi: పాంగాంగ్ సరస్సుపై చైనా బ్రిడ్జి.. కేంద్రంపై రాహుల్ ఫైర్
- Rahul Gandhi: ఇండియాలోనూ శ్రీలంక పరిస్థితే: రాహుల్ గాంధీ
- TS Politics : కాంగ్రెస్ వన్ ఫ్యామిలీ వన్ టికెట్ ఫార్మలాతో..తెగ టెన్షన్ పడిపోతున్న తెలంగాణ సీనియర్ నేత
- Andhra Pradesh : మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు
- Rahul Gandhi: దేశ ఆర్ధిక వ్యవస్థను బీజేపీ నాశనం చేసింది: రాహుల్ గాంధీ విసుర్లు
1Qutub Minar Row: కుతుబ్ మినార్ను దేవాలయంగా మార్చలేం: పురాతత్వ శాఖ
2సుబ్రహ్మణ్యం కేసు ..తెరపైకి కొత్త విషయాలు
3క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ
4Puducherry Zipmer : పుదుచ్ఛేరి జిప్ మర్ లో 113 ఉద్యోగ ఖాళీల భర్తీ
5Directors : స్టార్ హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్స్
6Peddapalli : నిత్యపెళ్లి కొడుకు..గుట్టురట్టు చేసిన నాలుగో భార్య
7Pawan Kalyan Janasena : ఏపీలో ఎన్నికల హీట్..‘జనసేన’ కోసం రంగంలోకి దిగిన ‘మెగాసేన’
8Haryanvi Singer Killed: హర్యాణా సింగర్ హత్య.. స్నేహితులే హంతకులు
9Srisailam : శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్
10Newborn Girl Child : అంత్యక్రియలు చేస్తుండగా.. చనిపోయిందనుకున్న శిశువు కదిలింది..!
-
Rohini Karte 2022 : రోహిణికార్తె వస్తోంది జాగ్రత్త.. భానుడు ఉగ్రరూపం చూపించే టైం..!
-
Old Woman : 70 ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం
-
Bihar CM Nitish : బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కీలక నిర్ణయం
-
Tirumala : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా విడుదల
-
Tomato Price : టమాటా ధరకు రెక్కలొచ్చాయ్..కేజీ ఎంతో తెలుసా!
-
Gyanvapi Mosque : నేడు జ్ఞానవాపి మసీదు వివాదంపై కీలక తీర్పు
-
Rajya Sabha : నేడే రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్
-
Ananthababu Remand : ఎమ్మెల్సీ అనంతబాబుకు 14రోజుల రిమాండ్