Rahul Gandhi: నెహ్రూ మ్యూజియం పేరు మార్పుపై స్పందించిన రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న క్రమంలో ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. లడఖ్ వెళ్తూ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.

Rahul Gandhi
Nehru Museum : న్యూఢిల్లీలోని తీన్ మూర్తి మార్గ్‌లో ఉన్న నెహ్రూ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. నెహ్రూ మ్యూజియం పేరును ప్రధాన మంత్రి మ్యూజియంగా మార్పు చేశారు. ఈ ఏడాది జూన్‌లో పేరుమార్పుపై నిర్ణయం తీసుకోగా.. బుధవారం ‘ ప్రధాన మంత్రి మెమోరియల్ ’ అనే పేరు అధికారికంగా అమల్లోకి వచ్చింది. పేరుమార్పుపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Rahul Gandhi : డిఫెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా రాహుల్ గాంధీ
ఆ పార్టీ జైరాం రమేశ్ ట్విటర్ వేదికగా బీజేపీ పై విమర్శలు చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నెహ్రూ మ్యూజియం, లైబ్రరీ పేరును ప్రధానమంత్రి మెమోరియల్ గా మార్చేశారు. నెహ్రూ పేరుతో ప్రధాని మోదీ అభద్రతా భావానికి గురయ్యారని, నెహ్రూ వారసత్వాన్ని దెబ్బతీయాలని ‘ఎన్’ స్థానంలో ‘పీ’ ను పెట్టారని చెప్పారు. ‘పీ’ అంటే కేవలం చిన్నతనం, దుఖం అనే భావమేనని అన్నారు.
Flash Floods : హిమాచల్, ఉత్తరాఖండ్ వరదల్లో 81కి పెరిగిన మృతుల సంఖ్య
జైరాం రమేష్ ట్వీట్‌కు బీజేపీ నేత షెహజాద్ పూనావాలా కౌంటర్ ఇచ్చారు దేశ ప్రధానులందరి విజయాలను సూచించే నిర్మాణాలకు కేవలం ఒక్క కుటుంబానికి చెందిన వారి పేరు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న క్రమంలో ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. లడఖ్ వెళ్తూ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. నెహ్రూ ఆయన చేసిన కృషి వల్ల కీర్తి, ప్రతిష్టలు వచ్చాయని, అవి కేవలం పేర్లు వల్ల లభించినవి కాదని చెప్పారు.