Congress: రాహుల్, ప్రియాంక సహా కాంగ్రెస్ నేతల విడుదల

ప్ర‌ధాన మంత్రి హౌస్ ఘెరావ్ పేరిట పార్ల‌మెంటు నుంచి రాష్ట్రప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు ఎంపీలు ర్యాలీ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో వీరిని అరెస్ట్ చేసి న్యూ పోలిస్ లైన్స్ కింగ్స్‭వే క్యాంప్ పోలిస్ స్టేషన్‭లో నిర్భంధించారు. కాగా, శుక్రవారం వీరందరినీ నిర్భంధం నుంచి పోలీసులు విడిచిపెట్టారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో వీరంతా తమ వాహనాల్లో న్యూ పోలిస్ లైన్స్ కింగ్స్‭వే క్యాంప్ పోలిస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుండగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వారికి స్వాగతం పలికారు

Congress: రాహుల్, ప్రియాంక సహా కాంగ్రెస్ నేతల విడుదల

Congress leaders leave from New Police Lines Kingsway Camp PS

Congress: దేశంలోని నిరుద్యోగం, ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను నిరసిస్తూ శుక్రవారం ఆందోళనకు దిగిన కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ప‌లువురు నేత‌ల‌ను మధ్యాహ్నం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసందే. ప్ర‌ధాన మంత్రి హౌస్ ఘెరావ్ పేరిట పార్ల‌మెంటు నుంచి రాష్ట్రప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు ఎంపీలు ర్యాలీ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో వీరిని అరెస్ట్ చేసి న్యూ పోలిస్ లైన్స్ కింగ్స్‭వే క్యాంప్ పోలిస్ స్టేషన్‭లో నిర్భంధించారు. కాగా, శుక్రవారం వీరందరినీ నిర్భంధం నుంచి పోలీసులు విడిచిపెట్టారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో వీరంతా తమ వాహనాల్లో న్యూ పోలిస్ లైన్స్ కింగ్స్‭వే క్యాంప్ పోలిస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుండగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వారికి స్వాగతం పలికారు. వీరి నిర్భంధాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఆందోళనలో భాగంగా పార్లమెంటు నుంచి విజయ్ చౌక్‌ రోడ్డులోని రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. అయితే కాంగ్రెస్ నేతలు ముందుకు రాకుండా పారామిలిటరీ, పోలీసు బలగాలు ఆ మార్గాన్ని బారీకేడ్లతో మూసివేశాయి. ఈ క్రమంలోనే రాష్ట్రపతి భవన్ మార్గంలో వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నిరసనల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించాలని కాంగ్రెస్ భావించింది. నిరసనలకు ముందు ఢిల్లీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. జాస్వామ్యం కనుమరుగైందని, ఆర్‌ఎస్ఎస్‌ దేశాన్ని నియంత్రిస్తోందని ఆరోపించారు.

దీనికి ముందు కాంగ్రెస్ ఎంపీలంతా పార్లమెంటులో హౌస్ వెలుపల నల్లదుస్తులు ధరించి తమ నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ నల్ల చొక్కా వేసుకున్నారు. పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ నిర్వహించాలనుకున్న ప్రొటెస్ట్ ర్యాలీకి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ నాయకత్వం వహించారు. ఆమె సైతం నలుపు దుస్తుల్లోనే నిరసనలో పాల్గొన్నారు. ధరల పెరుగుదల, అగ్నిపథ్‌పై తాము నిరసన చేస్తున్నామని, రాజకీయ పార్టీగా, ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా ప్రజా సమస్యలు, భయాలపై గళం విప్పడం తమ బాధ్యతని, అదే తాము చేస్తున్నామని ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలు అన్నారు.

Venkaiah Naidu: అరెస్ట్ నుంచి తప్పించుకునే అధికారం ఎంపీలకు లేదు