Anurag Thakur: జైలులో మసాజులు, లగ్జరీ లైఫ్.. ఇదే కేజ్రీవాల్ మోడల్: కేంద్ర మంత్రి

 జైలులో ఉంటున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ కు అందుతున్న రాజభోగాలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శలు గుప్పించారు. మొదట సత్యేందర్ జైన్ జైలులో మసాజ్ చేయించుకుంటున్న వీడియో బయటపడింది. తాజాగా, ఆయనకు ఇష్టం వచ్చిన ఆహారాన్ని అందించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ... జైలులో ఫైవ్-స్టార్ హోటల్ సౌకర్యాలు అందుతాయి. ఇదే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మోడల్. జైలులో ఉన్నవారు మంచివారంటూ కేజ్రీవాల్ సర్టిఫికెట్ ఇస్తారు’’ అని చెప్పారు.

Anurag Thakur: జైలులో మసాజులు, లగ్జరీ లైఫ్.. ఇదే కేజ్రీవాల్ మోడల్: కేంద్ర మంత్రి

Anurag Thakur

Anurag Thakur: జైలులో ఉంటున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ కు అందుతున్న రాజభోగాలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శలు గుప్పించారు. మొదట సత్యేందర్ జైన్ జైలులో మసాజ్ చేయించుకుంటున్న వీడియో బయటపడింది. తాజాగా, ఆయనకు ఇష్టం వచ్చిన ఆహారాన్ని అందించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ… జైలులో ఫైవ్-స్టార్ హోటల్ సౌకర్యాలు అందుతాయి. ఇదే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మోడల్. జైలులో ఉన్నవారు మంచివారంటూ కేజ్రీవాల్ సర్టిఫికెట్ ఇస్తారు’’ అని చెప్పారు.

ఆరేళ్లుగా జైలులో ఉంటున్న సత్యేందర్ జైన్ హాయిగా వినోదం, మసాజ్ లతో గడిపేస్తున్నారని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. జైలులోనూ ఇటువంటి లగ్జరీ జీవితాన్ని ఎలా అనుభవించాలన్న విషయంపై ఆప్ ఉదాహరణగా నిలుస్తోందని ఎద్దేవా చేశారు.

‘‘ఆప్ నేతలు అసత్యాలు చెబుతారు. జైలులో ఖైదీలకు ఎదురయ్యే ఆహార సమస్యలపై మాట్లాడతారు. కానీ, వీళ్లేమో భోజనాన్ని ఫైవ్-స్టార్ హోటల్ నుంచి తెప్పించుకుంటారు. జైలులో మినరల్ వాటర్, మసాజులు కూడా అందుతున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. పంజాబ్, ఢిల్లీ మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, అటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు గుజరాత్ లో ఓట్లు వేయరని ఆయన అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..