CWG 2022: కామన్వెల్త్‌‌ గేమ్స్‌: భారత బాక్సర్లకు గోల్డ్ మెడల్.. కాంస్య పతకం సాధించిన మహిళా హాకీ టీమ్

కామన్వెల్త్‌‌ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ఆదివారం జరిగిన పలు విభాగాల మ్యాచుల్లో దేశానికి పతకాల పంట పండించారు. బాక్సింగ్‌లో రెండు బంగారు పతకాలు గెలుచుకోగా, 16 సంవత్సరాల తర్వాత భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

CWG 2022: కామన్వెల్త్‌‌ గేమ్స్‌: భారత బాక్సర్లకు గోల్డ్ మెడల్.. కాంస్య పతకం సాధించిన మహిళా హాకీ టీమ్

CWG 2022: కామన్వెల్త్‌‌ గేమ్స్‌-2022లో భారత బాక్సర్లు సత్తా చాటారు. బాక్సింగ్‌లో రెండు బంగారు పతకాలు సాధించారు. మహిళల బాక్సింగ్‌లో నీతూ ఘంఘాస్ 48 కేజీల విభాగంలో, పురుషుల బాక్సింగ్‌లో అమిత్ పంఘాల్ 51 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్స్ సాధించారు.

Black Magic: కూతురుకు దెయ్యం పట్టిందని.. కొట్టి చంపిన తల్లిదండ్రులు

అమిత్ పంఘాల్.. ఇంగ్లండ్‌కు చెందిన మ్యాక్ డొనాల్డ్‌ను 5-0 తేడాతో ఓడించాడు. నీతూ.. 2019 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌లో బ్రాంజ్ మెడలిస్ట్ అయిన డెమీ జేడ్ రెస్టాన్‌పై 5-0తో విజయం సాధించింది. మరోవైపు భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన పోరులో 2-1తో విజయం సాధించింది. దాదాపు పదహారు సంవత్సరాల తర్వాత ఇలా భారత మహిళా హాకీ జట్టు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించడం విశేషం. ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన మ్యాచులో కూడా మెరుగైన ప్రదర్శనే చేసింది మన జట్టు. కానీ, అంపైర్ వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఫైనల్ చేరలేకపోయింది. అయితే, కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచులో మాత్రం మహిళా హాకీ టీమ్ అదరగొట్టింది.

Fake Traffic Police: అసలు పోలీసులతో కలిసిపోయి చలాన్లు వసూలు చేస్తున్న నకిలీ ట్రాఫిక్ పోలీస్

అలాగే పది వేల మీటర్ల రేస్ వాక్‌లో భారత అథ్లెట్ సందీప్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. పురుషుల ట్రిపుల్ జంప్‌లో ఎల్దోస్ పాల్ బంగారు పతకం సాధించగా, అబ్దుల్లా అబూబాకర్ రజత పతకం సాధించాడు. బ్యాడ్మింటన్‌ మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్ ఫైనల్ చేరాడు. సింగపూర్‌కు చెందిన జియా హెంగ్‍‌పై 2-1తో విజయం సాధించాడు. ఇంకా పలు మ్యాచులు కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లో వాటికి సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.