తండ్రి రెండో పెళ్లి చేసుకుంటే..ప్రశ్నించే హక్కు కూతురుకి ఉంది : హైకోర్టు

తండ్రి రెండో పెళ్లి చేసుకుంటే..ప్రశ్నించే హక్కు కూతురుకి ఉంది : హైకోర్టు

Daughter Question Validity Of Father's Second Marriage

Daughter Question Validity Of Father’s Second Marriage : తండ్రి రెండో వివాహం చేసుకుంటే ప్రశ్నించే హక్కు కూతురుకి కూడా ఉందని బాంబే హైకోర్టు స్పష్టంచేసింది. రెండో వివాహం చేసుకున్న తండ్రిని ఓ మహిళ ప్రశ్నించింది. తన తండ్రి రెండో వివాహం చేసుకున్న మహిళ మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండానే తన తండ్రిని వివాహం చేసుకోవటం ఎలా కుదురుతుంది? అని ప్రశ్నించింది. ఈ కేసు విషయంలో ఫ్యామిలి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. తండ్రి రెండో వివాహాన్ని ప్రశ్నించే హక్కు కూతురుకు తప్పకుండా ఉంటుందని స్పష్టంచేసింది.

రెండవ వివాహం అనేది ఇద్దరు వ్యక్తులకు చెందిన కాబట్టి భార్య, లేదా భర్త మాత్రమే కోర్టులో దాని చెల్లుబాటుని ప్రశ్నించాలంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుని బాంబో హైక్టో జస్టిస్‌ ఆర్‌డి ధనూక, జస్టిస్‌ విజీ బిషత్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం (మార్చి 17,2021) కొట్టివేసింది. 66 ఏళ్ల మహిళ మరణించిన తన తండ్రి రెండో వివాహం చెల్లుబాటుపై ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్‌ చేస్తూ హైకోర్టుకెక్కారు. ఆ పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు కన్న కూతురిగా తండ్రి రెండో పెళ్లిని ప్రశ్నించే అధికారం ఆమెకు ఉందని తేల్చిచెప్పింది.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే..2016లో ఒక మహిళ తన తండ్రి రెండో వివాహం చెల్లుబాటును ప్రశ్నిస్తూ ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ వేశారు. 2003లో తన తల్లి మరణించాక తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. 2016లో తండ్రి మరణించాడు. తండ్రి చనిపోయాకు సదరు పిటీషన్ వేసిన మహిళకు తన సవితి తల్లి మొదటి భర్తతో విడాకులు తీసుకోకుండానే తన తండ్రిని రెండో పెళ్లి చేసుకున్నట్టుగా ఆమెకి తెలిసింది.

పైగా తన తండ్రికి సంబంధించిన ఆస్తులన్నీ సవితి తల్లే అనుభవిస్తూ ఉండడంతో విడాకులు తీసుకోకుండా ఆమె చేసుకున్న పెళ్లి ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నిస్తూ ఫ్యామిలీ కోర్టుకెక్కారు. అయితే ఫ్యామిలీ కోర్టులో సవితి తల్లి.. వివాహం అనేది ఇద్దరి వ్యక్తులకు సంబంధించినదని, దాని చెల్లుబాటును కుమార్తె ఎలా ప్రశ్నిస్తారని వాదించారు. ప్రశ్నించారు. ఈ కేసులో సదరు ఫ్యామిలీ కోర్టు పిటీషనర్ సవితి తల్లికి అనుకూలంగా తీర్పు చెప్పింది. ఆ తీర్పుని సవాల్‌ చేస్తూ ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తండ్రి వివాహాన్ని ప్రశ్నించే హక్కు కూతురుకు ఉంటుందని స్పష్టంచేసింది ధర్మాసనం. దీంతో ఆమెకు హైకోర్టులో ఊరట లభించింది.