Dawood Ibrahim: కరాచీలో ఉన్న దావూద్ ఇబ్రహీం.. ఈడీకి వెల్లడించిన మేనల్లుడు

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కస్కర్ ఆచూకీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెప్పేశాడు అతని మేనల్లుడు అలీషా పార్కర్. ఇటీవల జరిపిన విచారణలో విషయాన్ని బయటపెట్టాడు. ఈ మేరకు దావూద్ ప్రస్తుతం కరాచీలో ఉన్నారని పార్కర్ పేర్కొన్నట్లు ఈడీ తన ఛార్జ్ షీట్‌లో పేర్కొంది.

Dawood Ibrahim: కరాచీలో ఉన్న దావూద్ ఇబ్రహీం.. ఈడీకి వెల్లడించిన మేనల్లుడు

Dawwod Ibrahim

 

Dawood Ibrahim: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కస్కర్ ఆచూకీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెప్పేశాడు అతని మేనల్లుడు అలీషా పార్కర్. ఇటీవల జరిపిన విచారణలో విషయాన్ని బయటపెట్టాడు. ఈ మేరకు దావూద్ ప్రస్తుతం కరాచీలో ఉన్నారని పార్కర్ పేర్కొన్నట్లు ఈడీ తన ఛార్జ్ షీట్‌లో పేర్కొంది.

హసీనా పార్కర్ కుమారుడైన అలీషా కూడా దావూద్‌తో టచ్‌లో లేనని చెప్పాడు. తాజాగా ఈడీ ముంబై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఇదే కేసులో ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ కూడా విచారణను ఎదుర్కొంటున్నారు. ఈద్ వంటి పండుగల సమయంలో దావూద్ భార్య మెహజబిన్ పార్కర్ కుటుంబాన్ని సంప్రదించేవారని ED ఛార్జ్ షీట్ పేర్కొంది.

ఫిబ్రవరిలో అలీషాను ED గ్రిల్ చేసింది. రుజువులో భాగంగా అతని వాంగ్మూలాన్ని ఛార్జ్ షీట్‌తో పాటు సమర్పించారు.

Read Also: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులపై ఎన్ఐఏ దాడులు

ఛోటా షకీల్‌ సహాయకుడు సలీం ఖురేషీని కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ బృందం విచారించింది. నకిలీ పాస్‌పోర్టు సృష్టించి.. దాంతో ఖురేషీ పలుమార్లు పాకిస్థాన్‌కు వెళ్లినట్లు ఈడీ పేర్కొంది. దావూద్‌, షకీల్‌ ఆదేశాల మేరకే పనిచేస్తున్నాడని కూడా ఆరోపించారు.

ఎఫ్‌ఐఆర్‌లో దావూద్ ఇబ్రహీం, హాజీ అనీస్ అలియాస్ అనీస్ ఇబ్రహీం షేక్, షకీల్ షేక్ అలియాస్ ఛోటా షకీల్, జావేద్ పటేల్ అలియాస్ జావేద్ చిక్నా, ఇబ్రహీం ముస్తాక్ అబ్దుల్ రజాక్ మెమన్ అలియాస్ టైగర్ మెమన్‌లను నిందితులుగా పేర్కొన్నారు.