త్వరలో దేశానికి “మోడీ” పేరు : మమతా బెనర్జీ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సోమవారం(మార్చి-8,2021)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోల్ కతాలో టీఎంసీ నిర్వహించిన ర్యాలీలో మమత పాల్గొన్నారు. నటీమణులు మరియు ప్రస్తుత టీఎంసీ అభ్యర్థులు జూన్ మలియా,సాయోని ఘోష్,సయాంతికా బెనర్జీ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

త్వరలో దేశానికి “మోడీ” పేరు : మమతా బెనర్జీ

MAMATA ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సోమవారం(మార్చి-8,2021)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోల్ కతాలో టీఎంసీ నిర్వహించిన ర్యాలీలో మమత పాల్గొన్నారు. నటీమణులు మరియు ప్రస్తుత టీఎంసీ అభ్యర్థులు జూన్ మలియా,సాయోని ఘోష్,సయాంతికా బెనర్జీ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మమతా బెనర్జీ..ఇటీవల అహ్మదాబాద్​లోని మొతేరా స్టేడియానికి మోడీ తన పేరు పెట్టుకున్నారని..కొవిడ్​-19 వ్యాక్సినేషన్​ ధ్రువపత్రాల్లో తన ఫొటోను ముద్రించుకున్నారని..దేశానికీ ఆయన పేరు పెట్టే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు. బెంగాల్​లో మహిళలకు భద్రత లేదంటూ ఆదివారం ప్రధాని చేసిన విమర్శలను మమతా తిప్పికొట్టారు.

మోడీని ఉద్దేశించి మాట్లాడుతూ.. అసత్యాలు, అబద్ధాలను వ్యాపింప చేయడానికే ఎన్నికల సమయంలో వారు బంగాల్​కు వస్తారు. మహిళల భద్రత కోసం ఆయన ఉపన్యాసాలు ఇస్తున్నారు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల పరిస్థితి ఏంటి? మోడీకి ప్రియమైన గుజరాత్​లో మహిళల పరిస్థితి ఎలా ఉంది? మోడీ-షా మోడల్ స్టేట్ గుజరాత్ లో గత రెండేళ్లుగా..రోజూ నాలుగు రేప్ లు,రెండు హత్యలు జరుగుతున్నాయని మమత తెలిపారు. ఎలాంటి రక్షణ లేనట్లయితే బెంగాల్ మహిళలు రాత్రివేళ్లల్లో స్వేచ్ఛగా రోడ్డపై తిరగగలుగుతుండేవాళ్లు కాదని మమత అన్నారు.

మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి టీఎంసీ మరోసారి అధికారంలోకి వస్తుందని అన్నారు. తానే మూడోసారి అధికారంలోకి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో మొత్తం 294 నియోజకవర్గాల్లో తనకు బీజేపీకి మధ్యే పోటీ అని మమత అన్నారు. ఇక,294 స్థానాలున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీకి మార్చి-27 నుంచి ఏప్రిల్-29వరకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.