Lottery: అప్పుల్లో కూరుకుపోయి, బ్యాంకు నోటీసు వచ్చిన కొద్ది సమయానికే భారీ లాటరీ తగిలింది
జూలైలో కూడా దాదాపుగా ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది. మహ్మద్ బావా అనే వ్యక్తి బ్యాంకు లోన్ చెల్లించలేక తన ఇంటిని అమ్మకానికి పెట్టాడు. 45 లక్షల రూపాయల అప్పు చేసి ఎనిమిది నెలల క్రితమే కట్టిన ఇంటిని కేవలం 40 లక్షల రూపాయలకే అమ్ముకోవాల్సి వచ్చింది. జూలై 25న అడ్వాన్స్ ఇవ్వడానికి అగ్రిమెంట్ కుదిరింది. ఇక ఇల్లు ఖాళీ చేసి అద్దె ఇంటికి మారేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో అతడికి ఒక కోటి రూపాయల లాటరీ తగిలింది

Debt Ridden Kerala Man Wins Rs 70 Lakh Lottery
Lottery: అన్నిసార్లు కష్టం, శ్రమ మనల్ని కాపాడకపోవచ్చు. కొన్నిసార్లు అదృష్టం కూడా కావాలి. కొన్నిసార్లైతే అనుకోని అదృష్టాలు కూడా కలిసి వస్తాయి. ఇలాంటి అదృష్టమే కేరళ వ్యక్తిని వరించింది. బ్యాంకు లోన్ తీసుకుని, అది తీర్చలేక తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన అతడికి.. మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డట్టు.. లోన్ రికవరీకి బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. ఒకవైపు అప్పులు, మరొకవైపు బ్యాంకు నోటీసులు.. ఇంతటి సంకటంలో ఏమీ తోచని పరిస్థితుల్లో అతడికి లాటరీ టికెట్ లాభాలను తెచ్చిపెట్టింది. తాజాగా విడుదల చేసిన లాటరీల్లో అతడు 70 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. బ్యాంకు నోటీసు అందిన కొద్ది సమయానికే ఇలా లాటరీ తగలడం విశేషం.
కేరళలోని కొల్లాం జిల్లా మినగపల్లికి చెందిన పూకుంజ్(40) అనే వ్యక్తికి బుధవారం కలిసి వచ్చిన అదృష్టం ఇది. పూకుంజ్ ద్విచక్ర వాహనంపై చేపలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అతడు కొద్ది రోజుల క్రితం కేరళ అక్షయ లాటరీ ఏకే570 కొద్ది రోజుల క్రితం లాటరీ టికెట్ కొన్నాడు. ఎప్పటిలాగే బుధవారం చేపలు అమ్ముకుని ఇంటికి తిరిగి వచ్చే సరికి 70 లక్షల రూపాయలు లాటరీ గెలుచుకున్నట్లు తెలిసింది. ఇక అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు నుంచి 9 లక్షల రూపాయల లోన్ పూకుంజ్ తీసుకున్నాడు. అయితే అవి తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడ్డాడు. బుధవారం సాయంత్రం చేపలు అమ్ముకుని ఇంటికి వచ్చి ముందుగా బ్యాంకు నోటీసే చూశాడు. గుండె పగిలి తీవ్ర నిరాశలో పడిపోయారు. ఇంతలో కొద్ది సమయానికి అతడి సోదరుడు ఫోన్ చేసి లాటరీ గెలుచుకున్నట్లు చెప్పాడు.
జూలైలో కూడా దాదాపుగా ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది. మహ్మద్ బావా అనే వ్యక్తి బ్యాంకు లోన్ చెల్లించలేక తన ఇంటిని అమ్మకానికి పెట్టాడు. 45 లక్షల రూపాయల అప్పు చేసి ఎనిమిది నెలల క్రితమే కట్టిన ఇంటిని కేవలం 40 లక్షల రూపాయలకే అమ్ముకోవాల్సి వచ్చింది. జూలై 25న అడ్వాన్స్ ఇవ్వడానికి అగ్రిమెంట్ కుదిరింది. ఇక ఇల్లు ఖాళీ చేసి అద్దె ఇంటికి మారేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో అతడికి ఒక కోటి రూపాయల లాటరీ తగిలింది. ఇంకే ముంది.. ఇల్లు వెనక్కి వచ్చింది. అప్పు తీరింది. బావా ఇంట్లో పండగ నెలకొంది.