కొత్త రూల్ : ఆ పని చేస్తే రేషన్ కట్ 

  • Published By: madhu ,Published On : November 29, 2019 / 01:02 PM IST
కొత్త రూల్ : ఆ పని చేస్తే రేషన్ కట్ 

దేశంలో కొత్త కొత్త రూల్స్ తెరమీదకు వస్తున్నాయి. నిబంధనలు పాటించకపోతే కఠినంగా వ్యవహరిస్తున్నారు అధికారులు. స్వచ్చ భారత్‌లో భాగంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నిబంధనలు రూపొందిస్తున్నాయి. అందులో భాగంగా బహిరంగంగా మల విసర్జన మానిపించడానికి జరిమానాలు విధిస్తున్నారు. ఈ అలవాటును రూపుమాపే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఎక్కడ అనుకుంటున్నారు..కదా..మహారాష్ట్ర అనురాగ్ బాద్ జిల్లాల్లోని జరంది గ్రామంలో ఒక రూల్ తీసుకొచ్చారు అధికారులు. 

అనురాగ్ బాద్ జిల్లాలో 5 వేలకు పైగా నివాసాల్లో మరుగుదొడ్లు నిర్మించారు. సరిపడా నీటి సౌకర్యం కూడా ఉంది. కానీ కొంతమంది మాత్రం బహరింగంగా మల విసర్జనకు వెళుతున్నారు. వీరికి ఎంత నచ్చచెప్పినా..పరిస్థితిలో మార్పు రావడం లేదు. దీంతో గ్రామ పంచాయతీ పెద్దలు సమావేశమయ్యారు. బహిరంగ మల విసర్జన చేస్తే..ఆ కుటుంబానికి రేషన్ కార్డు రద్దు చేయాలని ఫైనల్‌గా నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఒక తీర్మానం ఆమోదించడం జరిగిందని గ్రామ పంచాయతీ సర్పంచ్ సమాధన్ తయాడే వెల్లడించారు. మల విసర్జన చేసే వ్యక్తుల చిత్రాలను గ్రామ పంచాయతీకి సమర్పిస్తే..వారికి పన్ను ప్రయోజనాలు లభిస్తాయన్నారు. పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడడానికే ఈ ప్రయత్నమని చెప్పారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జరిమానాలు వేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో బహిరంగంగా మల విసర్జన చేస్తే చెత్త ఎత్తే జరిమాన అమలు చేస్తున్నారు. ఇండోర్‌లో బహిరంగ మల విసర్జన నిషేధం. 
Read More : రేషన్ కార్డు ఉంటే..రూ. 1000, చీర, పంచె