E-Cycles: సైకిళ్లకు కూడా సబ్సీడీ ఇస్తామంటోన్న ఢిల్లీ గవర్నమెంట్

ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమోట్ చేసే దిశగా ఢిల్లీ గవర్నమెంట్ భారీ ఆఫర్లు ప్రకటిస్తుంది. ఇందులో భాగంగానే చివరికి ఈ-సైకిళ్లకు కూడా సబ్సీడీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ముందుగా కొనుగోలు చేసిన

E-Cycles: సైకిళ్లకు కూడా సబ్సీడీ ఇస్తామంటోన్న ఢిల్లీ గవర్నమెంట్

E Cycles

E-Cycles: ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమోట్ చేసే దిశగా ఢిల్లీ గవర్నమెంట్ భారీ ఆఫర్లు ప్రకటిస్తుంది. ఇందులో భాగంగానే చివరికి ఈ-సైకిళ్లకు కూడా సబ్సీడీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ముందుగా కొనుగోలు చేసిన 10వేల మంది కస్టమర్లకు రూ.5వేల 500 చొప్పున చెల్లించనున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా ముందుగా కొనుగోలు చేసిన 1000మంది కొనుగోలుదారులకు ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అదనంగా రూ.2వేలు సబ్సిడీ దక్కుతుందని ట్రాన్స్‌పోర్ట్ మినిష్టర్ కైలాశ్ గెహ్లాట్ స్పష్టం చేశారు.

దేశంలోనే ఈ-సైకిల్ విభాగానికి రాయితీలు అందించే తొలి రాష్ట్రంగా ఢిల్లీ అవతరించింది. భారీ కార్గో ఈ-సైకిళ్లు, వాణిజ్య అవసరాల కోసం ఇ-కార్ట్‌ల కొనుగోలుపై రాయితీని కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా మంత్రి తెలిపారు.

ఈ ప్రకటనపై హీరో లెక్ట్రో సీఈవో ఆదిత్య ముంజాల్ స్పందిస్తూ, ఈవీ సబ్సిడీ విధానంలో ఈ-సైకిళ్లను చేర్చాలనే ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ విషయమని అన్నారు.

Read Also: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు

“సబ్సిడీని అందించడానికి ఎలక్ట్రిక్ సైకిళ్లను EV పాలసీ పరిధిలోకి తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. సమాజం కోసం ఈ సైకిళ్లను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు ఇది సరైన అడుగు. హీరో లెక్ట్రో, హీరో లెక్ట్రో కార్గో లాంచ్ చేసినప్పటి నుంచి వినియోగదారులు వ్యక్తిగత, వాణిజ్య అవసరాల కోసం వీటిని వాడుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం అందించే సబ్సిడీ మద్దతు ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుంది. కొత్త ఆదాయ వనరులను సృష్టిస్తుంది” అని ముంజాల్ అన్నారు.