PIL కొట్టేసిన హైకోర్టు : ATM కార్డులకు బదులుగా DDA కార్డులు

  • Published By: sreehari ,Published On : November 5, 2019 / 12:37 PM IST
PIL కొట్టేసిన హైకోర్టు : ATM కార్డులకు బదులుగా DDA కార్డులు

ఏటీఎం కార్డులకు బదులుగా మరింత భద్రత పరమైన కార్డులను తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏటీఎం కార్డుల స్థానంలో సెక్యూరిటీ కార్డులైన డైనమిక్ డేటా అథెంటికేషన్ (DDA) కార్డులను ప్రవేశపెట్టాలని కోరుతూ ఢిల్లీహైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై విచారించిన హైకోర్టు ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

చీఫ్ జెస్టిస్ డి.ఎన్ పటేల్, జస్టిస్ సి. హరి శంకర్ తో కూడిన ధర్మాసనం.. ఇది పాలసీ నిర్ణయామని, ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవని స్పష్టం చేసింది. అంతేకాదు.. పిల్ దాఖలు చేసిన NGOను తన ఫిర్యాదును విత్ డ్రా చేసుకోవాలని సూచించింది. DDA కార్డుల వినియోగానికి సంబంధించి భారతీయ అవినీతి నిరోధక మండలి అమలు చేస్తుందని NGOకు కోర్టు తెలిపింది. 

ఇది తన సొంత బ్యాంకును ప్రారంభించడం ద్వారా లేదా అలాంటి కార్డులను అందించే బ్యాంకు కస్టమర్ కావడం ద్వారా DDA కార్డుల వాడకాన్ని అమలు చేయగలదని తెలిపింది. ఒక పిటిషనర్ అయిన NGO.. ఏటీఎం కార్డుల కంటే DDA కార్డులే మరింత సెక్యూర్ అని భావించిన మాత్రాన దేశంలోని అన్ని బ్యాంకులను DDA కార్డులకు మార్చమని ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

మీరు ఏదైనా బ్యాంకును ప్రారంభించి.. డీడీఏ కార్డులను జారీ చేసుకోవచ్చునని సూచించింది. కేంద్ర ప్రభుత్వం తరపున కోర్టులో న్యాయవాది ఫర్మాన్ అలీ మ్యాగ్రే వాదనలు వినిపించారు. ఆర్బీఐకు చెందిన కౌన్సిల్ కూడా ఈ ఫిర్యాదును వ్యతిరేకిస్తూ.. ఇదొక పాలసీ నిర్ణయమని తేల్చి చెప్పింది. 

కోర్టు సూచనలతో ఎన్జీవో తన పిటిషన్ విత్ డ్రా చేసుకున్నారు. ఏటీఎం కార్డుల మోసాలైన కార్డు స్కిమ్మింగ్ లేదా క్లోనింగ్ వంటి మోసపూరిత చర్యలను అడ్డుకునేందుకు లేటెస్ట్ ఎన్ క్రిప్షన్ మెథడ్ తో కూడిన DDA కార్డులు ఎంతో సెక్యూర్ గా ఉంటాయని NGO తన ఫిర్యాదులో కోర్టుకు విన్నవించే ప్రయత్నం చేశారు.

పిటిషన్ ప్రకారం.. 2018-19లో జరిగిన ఏటీఎం  మోసాలకు సంబంధించి డేటాను ఆర్బీఐ జూలైలో రివీల్ చేసింది. ఇందులో మహారాష్ట్రలో రూ.4.8 కోట్లు బాధితులు కోల్పోగా, ఢిల్లీలో రూ.2.9 కోట్లు వరకు బాధితులు నష్టపోయినట్టు పిటిషనర్ ప్రస్తావించారు.