Heavy Rainfall : ఢిల్లీని కుమ్మేస్తోంది…46 ఏళ్ల తర్వాత

ఉదయం నుంచి గ్యాప్ ఇవ్వకుండా పడుతున్న వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి. . ఊహించని భారీ వర్షంతో... అనేక చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి.

Heavy Rainfall : ఢిల్లీని కుమ్మేస్తోంది…46 ఏళ్ల తర్వాత

Delhi

Delhi : దేశ రాజధాని ఢిల్లీని కుమ్మేస్తోంది. 46 సంవత్సరాల రికార్డు బద్దలు. కాలుష్యం..అనుకుంటున్నారా . కాదు భారీ వర్షం. అవును అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. వర్షం కుమ్మేస్తోంది. ఉదయం నుంచి గ్యాప్ ఇవ్వకుండా పడుతున్న వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి. . ఊహించని భారీ వర్షంతో… అనేక చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. అండర్ పాస్‌లలోకి భారీగా నీరు చేరింది. ఢిల్లీలోని పూల్ ప్రహ్లాద్ పూర్, ఇండియా గేట్, మధు విహార్, మోతీ బాగ్, RK పురం, జోర్ బాగ్ ఏరియాల్లో భారీ వర్షంతో కాలనీలు, రోడ్లపైకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

Read More : Vikarabad : మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై : విప్లవాత్మకమైన చర్య – సింధియా

పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో.. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక దేశ రాజధానిలో ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో 46 ఏళ్ల రికార్డు బద్దలయింది. 46 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బహదూర్‌గఢ్, గురుగ్రామ్, మనేసర్, ఫరీదాబాద్, హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్, ఘజియాబాద్, ఛప్రౌలా, నోయిడా వంటి అనేక ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల తీవ్ర గాలులతో పాటు ఉరుములతో కూడిన వర్షం విరుచుకుపడుతోంది. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలలో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Read More : Vaccine Vinayaka : వ్యాక్సిన్ వినాయకుడు..టీకా వేయించుకుంటేనే రమ్మంటున్నాడు..

ఢిల్లీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. అలాగే బలమైన గాలులు కూడా వీస్తాయని తెలిపింది. ఢిల్లీలో అతి భారీ వర్షాలు కురవడం 10 రోజుల గ్యాప్ లో ఇది రెండోసారి. గత వారం ప్రారంభంలో… భారీ వర్షాలకు ఢిల్లీ, NCRలు వణికిపోయాయి. మధ్యలో దాదాపు వారం గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు వర్షాలు దంచికొడుతున్నాయి. వాస్తవంగా ఈసారి నైరుతి రుతు పవనాలు ఢిల్లీని ఆలస్యంగా పలకరించాయి. ఇంత లేట్ కావడం ఇప్పటివరకు ఇదే ఫస్ట్ టైమ్. అయితే వాటి ఎఫెక్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఢిల్లీలో నమోదైన వర్షపాతం వెయ్యి మిల్లీ మీటర్లు దాటిపోయింది. మరోవైపు.. వర్షాల కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. టీ-3 టెర్మినల్‌ను వరద ముంచెత్తింది. రన్ వే పైకి వరద నీరు చేరడంతో.. విమానాలు నిలిచిపోయాయి.