Vikarabad : మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై : విప్లవాత్మకమైన చర్య – సింధియా

దేశంలో తొలిసారిగా ఆకాశమార్గాన డ్రోన్‌లతో ఔషధాల పంపిణీ ప్రయోగానికి తెలంగాణ వేదికైంది. మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై ప్రాజెక్టును వికారాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.

Vikarabad : మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై : విప్లవాత్మకమైన చర్య – సింధియా

Drone

Medicine From The Sky : దేశంలో తొలిసారిగా ఆకాశమార్గాన డ్రోన్‌లతో ఔషధాల పంపిణీ ప్రయోగానికి తెలంగాణ వేదికైంది. మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై ప్రాజెక్టును వికారాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర మంత్రి కేటీఆర్. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు ఔషధాలు, టీకాలను వేగంగా చేరవేయడానికి డ్రోన్లను వినియోగించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సింధియా మాట్లాడుతూ…డ్రోన్ టెక్నాలజీ గురించి చాలా విన్నామని, ఇదొక టెక్నాలజీ మారమే కాదని..విప్లవాత్మకమైన చర్యగా ఆయన అభివర్ణించారు.

Read More : Telangana : డ్రోన్ల ద్వారా కొవిడ్ మందులు, టీకాల పంపిణీ..ఎంత దూరమైనా అనుమతి
మోడీ కల : –

డ్రోన్ లో కొత్త ఆవిష్కరణ చూస్తున్నట్లు, మానవమనుగడకు డ్రోన్ లు ఈ విధంగా ఉపయోగపడడం సంతోషకరమన్నారు. మందులను డ్రోన్ ల ద్వారా పంపిణీ చేయడం…ప్రపంచానికి ఆదర్శమన్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్రం…వేదిక అయ్యిందన్నారు. ప్రధాన మంత్రి మోడీ కల అని, ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో…కొన్ని కఠినతరమైన చట్టాలను సులభతరం చేశారన్నారు.

Read More : ISRO Drones Covid-19 : డ్రోన్లతో కరోనా సేవలు… ఇస్రో ట్రయల్ రన్
సబ్ కా సాత్ వికాస్ : –

ఒక డబ్బాలో మెడిసిన్ ను తీసుకొని వెళ్లడం..ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. ప్రతి గ్రామానికి వైద్యం అందుబాటులోకి తీసుకరావాలని…మందులు, వ్యాక్సిన్లు అందచేయాలనే ఈ ప్రయత్నమన్నారు. వ్యాక్సిన్లు దూర ప్రాంతాలకు అందచేయాలంటే…ఇక ఇబ్బంది లేకుండా..డ్రోన్ల ద్వారా చేసుకోవచ్చన్నారు. సబ్ కా సాత్..సబ్ కా వికాస్…సబ్ కా ప్రయాస్ అనే నినాదాలతో ముందుకు వెళుదామన్నారు.

Read More : ఆకాశంలో ఎగిరే పిజ్జాలు.. డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీ.. భవిష్యత్తులో జరగబోయేది ఇదే
తెలంగాణ రికార్డు : –

దేశంలోనే మొదటిసారిగా డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్లు , మందులు సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు క్రియేట్ చేసింది. కరోనా వ్యాక్సిన్‌ల పంపిణీ కోసం బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ డ్రోన్లను వినియోగిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కరోనా మందులు, టీకాలను డ్రోన్ల ద్వారా పంపిణీ చేస్తామని చెప్పిన మంత్రి కేటీఆర్ తొలిదశలో 11వ తేదీ శనివారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకు వికారాబాద్ జిల్లాలో డ్రోన్ల ద్వారా మందులను సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.

Read More : రైతులకు మంచికాలం : తెలంగాణలో డ్రోన్‌ సిటీ
ట్రయల్ సక్సెస్ : –

రెండు రోజుల పాటు నిర్వహించిన ట్రయల్ సక్సెస్ అయింది. తొమ్మిది కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు సేవలను విస్తరిస్తారు. ఈ విధానం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. ఆశ వర్కర్లకు సైతం ఇబ్బందులు తప్పనున్నాయి. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు ఔషధాలు, టీకాలను వేగంగా చేరవేయడానికి డ్రోన్లను వినియోగించనున్నారు. గ్రామీణ  ప్రాంతాలకు వ్యాక్సిన్ తరలింపే లక్ష్యంగా మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై ప్రాజెక్టును రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ట్రయల్ రన్​సమయంలో విజువల్ లైన్‌కు ఇవతలివైపు 400 మీటర్ల ఎత్తు వరకు మెడిసిన్ బాక్సును ఈ సంస్థల డ్రోన్లు తీసుకెళ్లాయి. డ్రోన్లు ఎంత కెపాసిటీ పేలోడ్స్​ను తీసుకెళ్తాయి. ఎంత దూరం వెళ్తాయనే అంశాలను పరిశీలిస్తున్నారు.