ISRO Drones Covid-19 : డ్రోన్లతో కరోనా సేవలు… ఇస్రో ట్రయల్ రన్

శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రాన్ని (షార్‌) అతలాకుతలం చేస్తున్న కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ఇస్రో డ్రోన్‌లను వినియోగిస్తోంది. దీనికోసం శ్రీహరికోట, సూళ్లూరుపేటలోని షార్‌ ఉద్యోగుల కాలనీల్లో ట్రయల్‌ రన్‌ నిర్వహించింది.

ISRO Drones Covid-19 : డ్రోన్లతో కరోనా సేవలు… ఇస్రో ట్రయల్ రన్

Isro Trail Run Drones For Covid 19 Services

ISRO Trail Run Drones for Covid-19 Services : శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రాన్ని (షార్‌) అతలాకుతలం చేస్తున్న కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ఇస్రో డ్రోన్‌లను వినియోగిస్తోంది. దీనికోసం శ్రీహరికోట, సూళ్లూరుపేటలోని షార్‌ ఉద్యోగుల కాలనీల్లో ట్రయల్‌ రన్‌ నిర్వహించింది.

ఈ ట్రయల్‌ రన్‌లో భాగంగా కరోనాబారినపడి హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్న వారికి మందులు, కూరగాయలు డ్రోన్‌ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. గరుడ ఏరోస్పేస్‌ కంపెనీ సహకారంతో ఈ ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.

ఇది విజయవంతం కావడంతో డ్రోన్‌ల వినియోగాన్ని కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. కాగా, శ్రీహరికోట, సూళ్లూరుపేటలోని షార్‌ ఉద్యోగుల కాలనీల్లో వందలాది మంది కరోనా బారినపడ్డారు.

ఇప్పటివరకు షార్‌లో 30 మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. తాజాగా బుధవారం సూళ్లూరుపేటలోని ఓ విశ్రాంత ఉద్యోగి మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున షార్‌ ఆస్పత్రిలో సీనియర్‌ టెక్నీషియన్‌, షార్‌ డ్రైవర్‌ తల్లి మృతి చెందారు.