మందు బాటిళ్లే ఆ దేవుడి నైవేద్యం : ఓల్డ్ మంక్ రమ్ తో భక్తుడి మొక్కు 

దేవాలయాలలో దేవుళ్లకు నైవేద్యంగా ఏం పెడతారు.. ఏంటా పిచ్చి ప్రశ్న అంటారా.. ఏదన్నా విషయం చెప్పుకుంటున్నాము అంటే విశేషమైతేనే కదా..

  • Published By: veegamteam ,Published On : March 19, 2019 / 10:26 AM IST
మందు బాటిళ్లే ఆ దేవుడి నైవేద్యం : ఓల్డ్ మంక్ రమ్ తో భక్తుడి మొక్కు 

దేవాలయాలలో దేవుళ్లకు నైవేద్యంగా ఏం పెడతారు.. ఏంటా పిచ్చి ప్రశ్న అంటారా.. ఏదన్నా విషయం చెప్పుకుంటున్నాము అంటే విశేషమైతేనే కదా..

దేవాలయాలలో దేవుళ్లకు నైవేద్యంగా ఏం పెడతారు.. ఏంటా పిచ్చి ప్రశ్న అంటారా.. ఏదన్నా విషయం చెప్పుకుంటున్నాము అంటే విశేషమైతేనే కదా.. ఇది ఇక్కడి దేవుడు అటువంటి విశేషం గలవాడే. అంతేకాదు అతనికి పెట్టే నైవేద్యం కూడా వెరీ డిఫరెంట్. సాధారణంగా దేవుళ్లకు నైవేద్యంగా పొంగలి.. పులిహోర, లడ్లు.. చక్కెర పొంగలి వంటివి పెడతారు. కానీ కేరళలోని ఓ దేవాలయంలో దేవుడి పెట్టే నైవేద్యం గురించి వింటే మందుబాబుల నోరు ఊరుతుంది.

ఎందుకంటే.. మద్యాన్ని ఆ దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. అది అక్కడ ఆనవాయితీ. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఆ గుడిలో దేవుడెవరో తెలుసా.. దుర్యోధనుడు. ఆయనకు  ఉండే ఏకైక ఆలయం ఇదే. కేరళ  కొల్లం జిల్లాలోని ఎడక్కాడ్ లో ఉంది ఈ దుర్యోధన ఆలయం. దాని పేరు పెర్వుర్తి మలంద.ఇక్కడ ఏటా ఉత్సవాలను చేసి.. మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. 
Read Also : అందంగా కన్పించేందుకు : మాయా రోజూ ఫేసియల్ చేయించుకుంటది

మార్చి 15 శుక్రవారం ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా..101 ఓల్డ్ మంక్ రమ్ బాటిల్స్‌ను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. స్థలపురాణం ప్రకారం ఈ ఆచారం కొనసాగుతోంది.ఒకసారి దుర్యోధనుడు ఈ ప్రాంతం గుండా వెళ్తూ దాహం వేయడంతో మలకంద్ గ్రామానికి వచ్చి తాగడానికి నీళ్లు అడిగాడు. దీంతో ఓ వ్యక్తి ఆయనకు కల్లు ఇచ్చాడట..అది తాగిన ధుర్యోధనుడు తృప్తిచెందాడట.  ఆ కారణంతో దుర్యోధనుడికి గుడి కట్టి మద్యాన్నే నైవేద్యంగా సమర్పించటం ఆనవాయితీగా వస్తోందని స్థానికులు చెబుతారు. 

గతంలో సారాయి సమర్పించేవారిని దీనిపై నిషేధం విధించడంతో కల్లు, విదేశీ మద్యం మాత్రమే అనుమతిస్తున్నట్టు ఆలయ కార్యదర్శి ఎస్బీ జగదీశ్ తెలిపారు. వీటితోపాటు చికెన్, పాన్, మేకలు, పట్టు వస్త్రాలను కూడా భక్తులు సమర్పించుకుంటారని వెల్లడించారు. ప్రస్తుత ఉత్సవాల్లో కొల్లం పట్టణానికి చెందిన ఓ ఎన్ఆర్ఐ 101 మద్య సీసాలను ఈ ఆలయంలో సమర్పించినట్టు తెలిపారు. అన్ని మతాలకు చెందివారూ ఇక్కడకు వస్తారని..ఇక్కడ కుల మతాలకు అతీతమని తెలిపారు.  

విదేశాల్లో ఉండే కేరళవాసులు స్వస్థలానికి వచ్చేటప్పడు ఈ ఆలయాన్ని సందర్శించి..తమ వెంట తెచ్చిన విదేశీ మద్యాన్ని నివేదిస్తారని..దాన్ని గుడి ఆవరణలోనే వేలం వేస్తారని..కాగా ఇంత పెద్ద మొత్తంలో మద్యం సమర్పించడం ఇప్పటి వరకు 22 సార్లు మాత్రమే జరిగిందని స్థానికులు తెలిపారు. గర్బగుడి కూడా లేని ఈ ఆలయం 24 గంటలూ తెరిచే ఉంటుందట. ఇక ఆలయ కమిటీలో అన్ని కులాల వారికి చోటు కల్పిస్తారని తెలిపారు.  
Read Also : అడిగితే కొడతాం: స్టూడెంట్‌ కుటుంబాన్ని ఉతికారేసిన కాలేజి యాజమాన్యం