International Flights : అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

కరోనా ధర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మరోమారు పొడిగించింది.

International Flights : అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

Plane

International Flights కరోనా ధర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మరోమారు పొడిగించింది. గతంలో విధించిన నిషేధం జులై-31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో
అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై ఆగస్టు 31 వరకు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు శుక్రవారం డీజీసీఏ తెలిపింది.

అయితే కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో అధికారుల అనుమతితో అంతర్జాతీయ ప్రయాణాలను అనుమతిస్తారని డీజీసీఏ స్పష్టంచేసింది. ఇక, కార్గో విమాన సేవలు మాత్రం మధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. విదేశీ వాణిజ్యంపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా గతేడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను డీజీసీఏ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని దేశాలకు విమాన సర్వీసులను మాత్రం కొనసాగిస్తోంది. భారత్ తో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకున్న 28 దేశాల నుంచి మాత్రమే విమానాలను భారత్ అనుమతిస్తోంది. అలాగే అవే దేశాలకు భారత్ నుంచి విమానాలను పంపుతోంది.