Dhanteras: ధన్‌తేరాస్ స్పెషల్, మేకింగ్ ఛార్జీలు లేవు.. వెయ్యి రూపాయల గిఫ్ట్ వౌచర్ | Dhanteras - Here are the best options

Dhanteras: ధన్‌తేరాస్ స్పెషల్, మేకింగ్ ఛార్జీలు లేవు.. వెయ్యి రూపాయల గిఫ్ట్ వౌచర్

దీపావళికి ముందుగా వచ్చే ధన్‌తేరాస్. ఈ మేరకు చాలా షాపులు గోల్డ్ అమ్మకాలపై ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. సంవత్సరమంతా ఆ ఇల్లు ఐశ్వర్యంతో కళకళలాడుతుందని విశ్వసిస్తుంటారు.

Dhanteras: ధన్‌తేరాస్ స్పెషల్, మేకింగ్ ఛార్జీలు లేవు.. వెయ్యి రూపాయల గిఫ్ట్ వౌచర్

Dhanteras: దీపావళికి ముందుగా వచ్చే ధన్‌తేరాస్ అంటే స్పెషల్. ఈ రోజున బంగారం కొంటే మంచిదనే సెంటిమెంట్ తో చాలా మంది జ్యూయెలరీ షాపుల వైపు అడుగులు వేస్తుంటారు. ఈ మేరకు చాలా షాపులు గోల్డ్ అమ్మకాలపై ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. వ్యాట్ లో తగ్గింపు, డిస్కౌంట్ వౌచర్లు ఇచ్చి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ సంస్థలు ప్రకటిస్తున్న ఆఫర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌: రూ.30వేలు విలువ చేసే బంగారు నగలు కొనుగోలు చేస్తే గ్రాము బంగారు నాణేన్ని ఆఫర్‌ చేస్తున్నారు. అలా రూ.30 వేలు పెరిగే కొద్ది నాణేలు పెరుగుతూనే ఉంటాయి. వజ్రాభరణాల విషయానికి వస్తే ప్రతి రూ.30వేల కొనుగోలుపై రెండు బంగారు నాణేలు ఇస్తున్నారు. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు మరో ఐదు శాతం అడిషనల్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ కూడా ఉంది.

తనిష్క్‌: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఈ సంస్థ.. ఆభరణాల తయారీ ఖర్చులపై 20 శాతం వరకు (వ్యాట్) రాయితీ ఇస్తోంది. అక్టోబరు 17న ప్రారంభమైన ఈ ఆఫర్‌ నవంబర్ 2న ముగియనుంది.

జోయాలుక్కాస్‌: బంగారంపై ప్రతి రూ.50వేలకు, వెండిపై ప్రతి రూ.10వేలు ఒక గిఫ్ట్‌ వౌచర్‌ అందుబాటులో ఉంది. రూ.25వేలు విలువైన వజ్రాభరణాలు కొనుగోలు చేస్తే వెయ్యి రూపాయల గిఫ్ట్‌ వౌచర్‌ ఆఫర్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి రూ.25 వేల చొప్పున ఒక్కో గిఫ్ట్ వౌచర్‌ అందజేస్తారు. నవంబరు 5 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

………………………………………. : దీపావళిరోజు ఆడపడుచులు హారతి ఇవ్వటం వెనుక అసలు కథేంటంటే?…

సెంకో గోల్డ్‌ అండ్‌ డైమండ్‌: బంగారు ఆభరణాల కొనుగోలులో గ్రాముపై రూ.225 రాయితీ ఇస్తోంది. గోల్డ్ వస్తువులపై మేకింగ్ ఛార్జెస్ పూర్తిగా ఎత్తేశారు. వజ్రాభరణాల తయారీపై 75 శాతం వరకు రాయితీ ఇస్తున్నారు. ఇవన్నీ లిమిటెడ్ టైం పీరియడ్ ఆఫర్లు మాత్రమే.

పీసీ జువెల్లర్‌: బంగారు నగల తయారీ ఖర్చులపై 30 శాతం వరకు రాయితీ, వెండి నగలు, వస్తువులపై కూడా రాయితీ ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డుతో కొనుగోళ్లు చేసేవారు రూ.7.5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ కూడా పొందొచ్చు. నవంబరు 7 వరకు ఈ ఆఫర్లు కొనసాగనున్నాయి.

నార్త్ ఇండియాలో ఐదు రోజుల పాటు దీపావళి పండగను జరుపుకొనే సంప్రదాయం ఉంది. మొదటి రోజునే ‘ధన్‌తేరాస్‌’ (ధన త్రయోదశి)గా పిలుస్తారు. ఐశ్వర్య దేవతగా పూజించే లక్ష్మీదేవి క్షీరసాగర మధనంలో ధనత్రయోదశి రోజున ఉద్భవించిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈరోజున బంగారం కొంటే శుభప్రదమని.. సంవత్సరం మొత్తం ఆ ఇల్లు ఐశ్వర్యంతో కళకళలాడుతుందని విశ్వసిస్తుంటారు.

 

×