Rajasthan : చిన్నారి ఎదుటే స్విమ్మింగ్ పూల్ లో డీఎస్పీ రాసలీలలు

ఇతరులకు మార్గదర్శంగా ఉండాల్సిన ఈ అధికారి...సరససల్లాపాల్లో మునిగి తేలారు. ఓ స్విమ్మింగ్ పూల్ లో చిన్నారి ఎదుటే మహిళతో రాసలీలలు కొనసాగించారు.

Rajasthan : చిన్నారి ఎదుటే స్విమ్మింగ్ పూల్ లో డీఎస్పీ రాసలీలలు

Dsp

DSP Heeralal : అసలే పోలీసు ఉన్నతాధికారి. బాధ్యతయుతమైన స్థానంలో ఉన్నారు. ఇతరులకు మార్గదర్శంగా ఉండాల్సిన ఈ అధికారి…సరససల్లాపాల్లో మునిగి తేలారు. ఓ స్విమ్మింగ్ పూల్ లో చిన్నారి ఎదుటే మహిళతో రాసలీలలు కొనసాగించారు. సదరు మహిళ కూడా కానిస్టేబుల్ కావడం గమనార్హం. జలకాలాడుతూ..తాము చేసుకున్న రోమాన్స్ ను వాట్సాప్ స్టేటస్ గా ఆ మహిళ పెట్టుకోవడంతో ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. దీంతో పోలీసులు దాడులు చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన జైపూర్ లో చోటు చేసుకుంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది.

Read More : Allu Arjun : కాకినాడలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్..

అజ్మీర్ జిల్లాలోని డీఎస్పీగా హీరాలాల్ పనిచేస్తున్నారు. జైపూర్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న మహళా కానిస్టేబుల్ తో కలిసి జులై 13వ తేదీన ఉదయ్ పూర్ లో ఉన్న ఓ రిసార్ట్ కు వెళ్లారు. అక్కడ సిమ్మింగ్ పూల్ లో జలకాలాడారు. ఈ సమయంలో ఓ చిన్నారి కూడా ఉంది. ఈ చిన్నారి..అతని కొడుకా ? మహిళా కానిస్టేబుల్ కొడుకా ? అనేది తెలియరాలేదు. అర్ధనగ్నంగా వీరిద్దరూ సన్నిహితంగా మెలిగారు. ఇదంతా…ఓ మహిళా కానిస్టేబుల్ తన ఫోన్ లో వీడియో తీసుకుంది. అనంతరం వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకుంది.

Read More : shells Ganesh : 7000 గవ్వలతో గణనాథుడు..సైకత శిల్పి అద్భుత సృష్టి

అంతే..వెంటనే ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే ఆ రిసార్ట్ పై దాడులు చేసి అధికారితో పాటు..కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పలువురు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. డీఎస్పీపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఏడీజీ అశోక్ రాథోడ్ దర్యాప్తు చేపడుతున్నారు. వీరిద్దరినీ పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.