Exercise in Pregnancy: బొజ్జలో బుజ్జాయి కోసం అమ్మకు సులువైన వ్యాయామాలు.

గర్భధరించి మహిళ బొజ్జలో బుజ్జాయి కోసం సులువైన వ్యాయామాలు చేయాలి. అలా చేస్తే..ఆమెకు, కడుపులోని బిడ్డకు ఎంతో ఉపయోగం. వ్యాయామాలు..పోషకాహారం తల్లీ బిడ్డల ఆరోగ్యానికి చక్కటి మార్గాలు.

Exercise in Pregnancy: బొజ్జలో బుజ్జాయి కోసం అమ్మకు సులువైన వ్యాయామాలు.

Small Exercise In Pregnancy

small Exercise in Pregnancy: గర్భం దాల్చాక..బిడ్డ ఆరోగ్యం కోసం తన ఆరోగ్యం కూడా తల్లి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.గర్భంతో ఉన్నా..ఆనందంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే తగినంత విశ్రాంతి తీసుకుంటు..పోషకాహా తింటూ కూడా సులువైన కొన్ని వ్యాయామాలు చేస్తే తల్లీ బిడ్డలకు ఎంతో మంచి చేస్తుంది. బిడ్డ ఆరోగ్యంగా పెరగటంతో పాటు తల్లి చాలా ఉత్సాహంగా ఉంటుంది.

5 Helpful Health Tips for Pregnant Women | Ampalaya Plus - Bitter Gourd for Diabetics to Control & Lower Sugar Levels

గర్భధరించిన మహిళ తేలికపాటి వ్యాయామం ఆమెకే కాదు కడుపులోని బిడ్డకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నార్వే శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో నిరూపించారు. గర్భధారణ సమయంలో తల్లి క్రమం తప్పకుండా వ్యాయామం చేసే లేదా శారీరకంగా చురుకుగా ఉంటారని అలాగే బిడ్డల ఊపిరితిత్తులు బలంగా ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడైందని తెలిపారు.వ్యాయామం చేసిన తల్లులకు పుట్టిన బిడ్డలు భవిష్యత్తులో ఆస్తమా వచ్చే అవకాశాలు ఉండవని తెలిపారు.

Hair Loss Treatment Drug : బట్టతల మహిళలకు శుభవార్త..నివారణకు మెడిసిన్ వచ్చేసింది..

 

Why Pregnancy Workouts Build Better Babies | Parents

పరిశోధనలో తేలిన నాలుగు ప్రధాన విషయాలు ఏమిటంటే..
ఈ పరిశోధన చేసిన ఓస్లో యూనివర్శిటీకి చెందిన చెందిన శాస్త్రవేత్తలు 800 మందికి పైగా గర్భిణీ స్త్రీలపై పరిశోధన చేశారు. ఈ పరిశోధన చేసే సమయంలో మహిళలు ఎంత చురుకుగా ఉన్నారో పరిశీలించారు. ఆ తరువాత వారికి జన్మించిన బిడ్డలను కూడా పరిశీలించారు.ఆ బిడ్డలు మూడు నెలల వయస్సు వచ్చాక వారి ఊపిరితిత్తుల ఆరోగ్యం ఎలా ఉంది? అని పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల్లో వారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని..శ్వాస తీసుకునే విషయంలో పర్ ఫెక్ట్ గా ఉన్నారని తెలిపారు.

Pelvic Floor Training During Pregnancy - PROnatal Fitness

బిడ్డల ఊపిరితిత్తులను పరీక్షించడానికి సైంటిస్టులు..పసిబిడ్డల ముక్కు, నోటిపై ముసుగు వేశారు. కాసేపటి తరువాత వారి ప్రశాంతత.. శ్వాస రేటు ఎలా ఉందో పర్యవేక్షించారు. పిల్లవాడు పీల్చే శ్వాసల సంఖ్య.. ఎంత ఊపిరి పీల్చుతున్నారో నమోదు చేశారు.
గర్భధారణ సమయంలో తల్లులు తేలికపాటి వ్యాయామం చేసి చురుకుగా ఉండటానికి ప్రయత్నించిన పిల్లల ఊపిరితిత్తులు ఇతర పిల్లల కంటే బలంగా ఉన్నాయని తేల్చారు.

Read more : Covid Vaccine.. మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చగలదు.. ఎలాగంటే?

Not just wind: the truth about those adorable newborn baby smiles

పిల్లలలో ఊపిరితిత్తుల వ్యాధిని తగ్గించడానికి వ్యాయామం చాలా ఉపయోగకరంగా ఉంటుందని..సులభమైన వ్యాయామాలు బిడ్డలకు,తల్లులకు కూడా చాలా మంచిది అనీ..ఓస్లో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకురాలు డాక్టర్ రెఫ్నా కట్రిన్ వెల్లడించారు.ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్న పిల్లలు ఆస్తమా వంటి ఇతర ఊపిరితిత్తుల వ్యాధులకు ఎక్కువగా గురవుతారని గతంలో తాము చేసిన పరిశోధనలో నిరూపితమైంది. అదే గర్భధారణ సమయంలో తల్లలు ఉత్సాహంగా ఉంటే..వ్యాయామాలు చేస్తే..శిశువులలో ఊపిరితిత్తుల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు అని సూచించారు. పిల్లలు ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి తల్లులకు వ్యాయామం సులభమైన మార్గం అని వెల్లడించారు.

Strengthening Exercises for Back Pain During Pregnancy

గర్భిణీలు తాము ఆరోగ్యంగా ఉంటే తమ బిడ్డలు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటారని తమ శారీరక, మానసిక ఆరోగ్యం బిడ్డలకు ఎంత ఉపయోగమో అవగాహన పొందాలని సూచించారు. అలాగే ప్రసవ సమయంలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే తేలిక పాటి వ్యాయామాలు చేయాలని సూచించారు. డాక్టర్ల సూచనల మేరకే ఎటువంటి వ్యాయామాలు చేయాలి?అని తెలుసుకుని చేయాలని ఇది చాలా ముఖ్యమైన విషయం అని తెలిపారు.అలాగే చక్కటి పోషకాహారం కూడా తీసుకోవాలని సూచించారు.