Chinese Loan App Case: చైనీయుల నియంత్రణలో ఉన్న లోన్‌యాప్‌ల గేట్‌వే ఖాతాల్లో రూ. 46.67 కోట్లు ఫ్రీజ్ చేసిన ఈడీ

చైనీయుల నియంత్రణలో ఉన్న లోన్ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో లోన్‌యాప్ గేట్‌వే ఖాతాల్లో రూ. 46.67కోట్ల నగదును ఫ్రీజ్ చేసినట్లు ఈడీ అధికారులు శుక్రవారం తెలిపారు.

Chinese Loan App Case: చైనీయుల నియంత్రణలో ఉన్న లోన్‌యాప్‌ల గేట్‌వే ఖాతాల్లో రూ. 46.67 కోట్లు ఫ్రీజ్ చేసిన ఈడీ

Chinese Loan App Case

Chinese Loan App Case: చైనీయుల నియంత్రణలో ఉన్న లోన్ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో లోన్‌యాప్ గేట్‌వే ఖాతాల్లో రూ. 46.67కోట్ల నగదును ఫ్రీజ్ చేసినట్లు ఈడీ అధికారులు శుక్రవారం తెలిపారు. బుధవారం ఢిల్లీ, ముంబయి, ఘజియాబాద్, లక్నో, గయాలోని పలు ప్రాంతాల్లో ఈజ్‌బజ్, రేజర్ పే, క్యాష్ పే, క్యాష్ ఫ్రీ, పేటీఎం వంటి చైనీయుల నియంత్రణలో ఉన్న లోన్ యాప్ కేంద్రాలపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం విధితమే. ఈ దాడుల్లో లోన్లకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పేమేంట్ గేట్‌వేల వర్చువల్ ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో లోన్‌యాప్‌ల గేట్‌వే ఖాతాల్లో రూ. 46.67 కోట్లను ఈడీ ఫ్రీజ్ చేసింది. ఈ నిధులు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఫ్రీజ్ చేసినట్లు తెలిపింది.

Loan Apps : లోన్‌ యాప్‌లపై RBIకు కేంద్రం ఆదేశాలు

చెల్లింపు అగ్రిగేటర్‌లతో ప్రమేయం ఉన్న సంస్థల వర్చువల్ ఖాతాలలో భారీ బ్యాలెన్స్‌లు నిర్వహించబడుతున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. రూ. 33.36 కోట్లు పూణేలోని ఈజ్‌బజ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో, బెంగళూరులోని రేజర్‌పే సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.8.21 కోట్లు, క్యాష్ ఫ్రీ పేమెంట్స్ సంస్థలో రూ. 1.28 కోట్లు. న్యూఢిల్లీలోని పేటీఎం పేమెంట్స్ సంస్థలో రూ. 1.11 కోట్లు స్వాధీనం ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Loan App Scams ED Search : లోన్‌యాప్స్ ఆగడాలపై ఈడీ దూకుడు..18 చోట్ల సోదాలు..రూ.17 కోట్లు సీజ్

అంతకుముందు సెప్టెంబర్ 3న చైనీయుల నియంత్రిస్తున్న చట్టవిరుద్ధమైన తక్షణ స్మార్ట్‌ఫోన్ ఆధారిత రుణాలు అందించే లోన్‌యాప్‌లపై కొనసాగుతున్న విచారణలో భాగంగా ఈ ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వేల బెంగళూరు ప్రాంగణంలో‌కూడా ఈడీ దాడులు నిర్వహించింది. సోదాల సమయంలో.. ఈ చైనీస్ వ్యక్తుల నియంత్రిత సంస్థల వ్యాపారి ఐడీలు, బ్యాంక్ ఖాతాలలో ఉంచబడిన రూ. 17 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. కాగా, 2021లో నాగాలాండ్ లో మనీలాండరింగ్ కేసు నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ చైనీస్ లోన్ యాప్ లపై దర్యాప్తు చేపడుతోంది.