Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు ED మరోసారి నోటీసులు .. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే మూడుసార్లు కవితను ఈడీ విచారించించిది. మరోసారి నోటీసులు జారీ చేయటం విశేషం.

ED Notices To Kavitha
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం (సెప్టెంబర్ 15,2023)న విచారణకు రావాలని పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో దూకుడు పెంచిన ఈడీ కవితను ఇప్పటికే మూడు సార్లు కవితను ఈడీ విచారించింది. ఈక్రమంలో మరోసారి నోటీసులు జారీ చేసి రేపు విచారణకు రావాలని ఆదేశించింది.మార్చి 16,20,21 తేదీల్లో కవితను విచారించిన ఈడీ మరోసారి విచారించేందుకు రమ్మని నోటీసులు జారీ చేసింది.
ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra pillaies)అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో రామచంద్ర పిళ్లై కంటే ముందు శరత్ చంద్రారెడ్డి (Sarath Chandra Reddy), మాగుంట శ్రీనివాస్ రెడ్డి(Magunta Srinivas Reddy), మాగుంట రాఘవ(Magunta Raghava),దినేష్ అరోరా(Dinesh Arora) అప్రూవర్‌గా మారారు. ఈ క్రమంలో కవిత విచారణ కీలకంగా మారినట్లుగా తెలుస్తోంది. ఈకేసులో నిందితులు అప్రూవర్లుగా మారిన క్రమంలో కవితను మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.
కాగా ఈ స్కామ్ లో నిందితులుగా ఉన్నవారు ఒక్కొక్కరుగా అప్రూవర్లుగా మారటంతో కేసు కీలక మలుపులు తిరుగుతోంది. సీబీఐ, ఈడీ గుర్తించిన నిందితుల్లో కవిత తప్ప దాదాపుగా అందరూ అప్రూవర్లుగా మారారు. దీంతో కవితకు మరోసారి నోటీసులు జారీ చేయటం ఆసక్తికరంగా మారింది. ఓ పక్క ఎన్నికలు దగ్గరపడటం..మరోసారి ఈడీ నోటీసులు వంటి విషయాలో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ కేసులో నిందితులు అందరు అప్రూవర్లుగా మారితే ఇక నిందితులు ఎవరు..? అనేది మరింత ఆసక్తక విషయం అని చెప్పాలి.