ఎన్నికల సిబ్బంది జీతం పెంపు: రోజుకు రూ.5 వేలు  

  • Published By: veegamteam ,Published On : April 7, 2019 / 05:07 AM IST
ఎన్నికల సిబ్బంది జీతం పెంపు: రోజుకు రూ.5 వేలు  

ఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బంది గౌరవ వేతనాలను పెంచుతు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కేంద్రం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. సిబ్బంది స్థాయిలను బట్టి వేతనాలకు ఈసీ పెంచింది. 
 

సెక్టార్ అధికారులకు రోజుకు రూ.5 వేలు, మాస్టర్ ట్రైనర్లకు రూ.2 వేలు, ప్రిసైడింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్‌వైజర్లు, రిసెప్షన్ సూపర్‌వైజర్లకు రోజుకు రూ. 350 చొప్పున, క్లాస్-4 ఉద్యోగులకు రూ. 150 గౌరవవేతనం అందజేయనున్నారు. మధ్యాహ్న భోజనానికి రూ.150 చెల్లించనున్నారు. వీడియో చిత్రీకరణ, అకౌంటింగ్, మానిటరింగ్, కంట్రోల్ రూం, కాల్‌సెంటర్, ఫ్లైయింగ్ స్కాడ్, స్టాటిక్స్ సిబ్బందికి స్థాయిని బట్టి గౌరవ వేతనం ఇవ్వనున్నారు.

 

ఎన్నికలు సక్రమంగా..నియమ నిబద్ధతలతో కొనసాగాలంటే ఆయా పోలింగ్ బూత్ లలో సిబ్బంది పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. ఓటర్లకు సహకరిస్తు..ఓటింగ్ శాతం పెంచేలా చేయటం..దానికి తగినట్లుగా సిబ్బంది విధులు నిర్వహించటం..టెక్నికల్ గా తలెత్తిన సమస్యలను పరిశీలిస్తునే ఓటర్లతో సక్రమంగా ఓట్లు వేయించటం వంటి పలు కీలక అంశాలు అన్ని ఎన్నికల సిబ్బందిపైనే ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలో వారు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. పోలింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి నిర్ణీత గడువు వరకూ ఎన్నికల సిబ్బంది ఎటువంటి పొరపాట్లు జరగకుండా వ్యవహరించటం వంటి పలు కీలక అంశాలపై వారు దృష్ణిని కేంద్రీకరించాలి. ఈ క్రమంలో సిబ్బంది వేతనాలను పెంచుతు  కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేయటం పట్ల వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు.