కరోనా వేళ..ఎన్నికలు టూత్ పిక్ తో ఓటు, చేతులకు గ్లవ్స్..కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

  • Published By: madhu ,Published On : August 22, 2020 / 09:40 AM IST
కరోనా వేళ..ఎన్నికలు టూత్ పిక్ తో ఓటు, చేతులకు గ్లవ్స్..కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

కరోనా వేళ..ఎన్నికలు వస్తే..ఏం చేయాలి ? ఎలాంటి మార్గదర్శకాలు పాటించాలనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికలు జరిగితే..తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సూచనలు వెల్లడించింది.



ఓటు వేసే వారు, ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు, పోలింగ్ జరిగే…ప్రాంతం, ఎన్నికలు ఎలా జరగాలో తెలిపింది. కేంద్రం విధించిన కోవిడ్ నిబంధనలు తు.చ తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది.

ఓటర్లు సామాజిక దూరం పాటించాలి. ఓటర్లకు ఖచ్చితంగా గ్లవ్స్ ఇవ్వాలి. ఓటు వేయకముందే..ఓటర్ స్లిప్ ఇవ్వాలి. ఓటు వేసేటప్పుడు వేలితో వేయవద్దు. టూత్ పిక్ తో ఉపయోగిస్తే బెటర్. 65 ఏళ్ల పైబడి ఉన్న వారు, హోం క్వారంటైన్ లో ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలి.



పోలింగ్‌ కేంద్రం వద్ద థర్మల్‌ స్కానర్లు ఏర్పాటు చేయాలి. పోలింగ్‌ కేంద్రంలో ఇన్..అవుట్…ద్వారాల్లో శానిటైజర్లు, సబ్బులు, నీరు అందుబాటులో ఉంచాలి. భౌతికదూరం పాటించేందుకు వీలుగా గుర్తులు ఏర్పాటు చేయాలి.

బీఎల్‌వోలు, వాలంటీర్లు భౌతికదూరం నిబంధనలు పాటించాలి. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బందికి మాస్క్‌, శానిటైజర్‌, ఫేస్‌ షీల్డ్‌, గ్లౌజ్‌లు ఇవ్వాలి. కౌంటింగ్ కేంద్రాలను ఓట్ల‌ లెక్కింపునకు ముందు, తర్వాత శానిటైజ్‌ చేయాలి.



కేంద్ర హోం శాఖ నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు, పార్టీలు పబ్లిక్ మీటింగ్ లు, రోడ్ షోలు నిర్వహించుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ లో నామినేషన్ దాఖలు చేయాలి. సెక్యూర్టీ డిపాజిట్ కూడ ఇదే విధంగా చేయాలి. మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.

థర్మల్ స్కానర్లు, పీపీఈ కిట్లు కూడా ఉండాల్సిందే. ఇంటింటి ప్రచారానికి అభ్యర్థితో పాటు ఐదుగురు మించ‌కుండా చూసుకోవాలి.



ఇక ఎన్నికలు అయిపోయిన అనంతరం ఓట్ల లెక్కింపు కూడా నిబంధనలు పాటించాలని చెప్పింది. ఓట్లు లెక్కించేటప్పుడు ఒక హాల్‌లో ఏడు టేబుళ్లు మాత్రమే ఏర్పాటు చేయాలి. ప్రతీ నియోజకవర్గంలో మూడు నాలుగు హాళ్లు ఏర్పాటు చేయాలి.

అదనపు సహాయ రిటర్నింగ్‌ అధికారుల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు చేప‌ట్టాలి. ప్రధానంగా..వీవీప్యాట్‌లను లెక్కింపునకు ముందు శానిటైజ్‌ చేయాలి. అంటూ..కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.