EPF Interest: వచ్చేనెలలో పీఎఫ్ ఖాతాదారులకు 8.5శాతం వడ్డీ!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO) 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీని త్వరలో క్రెడిట్ చేయనుంది. వచ్చే నెలాఖరులోగా 6 కోట్లకు పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

EPF Interest: వచ్చేనెలలో పీఎఫ్ ఖాతాదారులకు 8.5శాతం వడ్డీ!

Epf Interest

EPF Interest – 6 Crore EPFO Members : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO) 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీని త్వరలో క్రెడిట్ చేయనుంది. వచ్చే నెలాఖరులోగా 6 కోట్లకు పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈపీఎఫ్ఓ 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతంగా అలాగే ఉంచింది. COVID-19 మహమ్మారి సమయంలో ఎక్కువ విత్ డ్రాలు పెరిగిపోతుండటంతో వారికి సహకారం అందించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది.

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈపీఎఫ్ఓ గత మార్చిలో 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును ఏడేళ్ల కనిష్టానికి 8.5 శాతానికి తగ్గించింది. 2018-19లో వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. EPFO ఖాతాదారులకు 2017-18 సంవత్సరానికి 8.55 శాతం వడ్డీ రేటును అందించింది. 2016-17లో వడ్డీ రేటు 8.65శాతంగా ఉంది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ EPFOతో నికర కొత్త నమోదు 2020లో ఇదే నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో దాదాపు 20శాతం పెరిగి 12.37 లక్షలకు చేరుకుంది.

ఫిబ్రవరి నెలలో 12.37 లక్షల నికర ఖాతాదారులతో పాటు తాత్కాలిక పేరోల్ డేటా పెరిగినట్టు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 2021 నెలలో 12.37 లక్షల నికర ఖాతాదారులు చేరగా.. 7.56 లక్షలు కొత్తగా చేరారు. కరోనా కష్ట సమయంలో EPFO ​​తన వాటాదారులందరికీ సాయం అందించడానికి కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.