EV Fires : పేలుతున్న ఈవీ బ్యాటరీలు.. దేశీయంగా బ్యాటరీల ఉత్పత్తియే బెటర్.. నీతి ఆయోగ్

EV Fires : దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు పేలడంపై వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ ఘటనలపై నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్‌డీఓ మాజీ చీఫ్‌, ప్రముఖ శాస్త్రవేత్త వీకే సారస్వత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

EV Fires : పేలుతున్న ఈవీ బ్యాటరీలు.. దేశీయంగా బ్యాటరీల ఉత్పత్తియే బెటర్.. నీతి ఆయోగ్

Need To Set Up Own Manufacturing Unit As Imported Cells Not Suitable For Indian Climate

EV Fires : దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు పేలడంపై వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ ఘటనలపై నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్‌డీఓ మాజీ చీఫ్‌, ప్రముఖ శాస్త్రవేత్త వీకే సారస్వత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీ బైక్‌ల బ్యాటరీలను దేశీయంగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈవీ బైక్‌ల కోసం దిగుమతి చేసుకున్న బ్యాటరీల్లో సెల్‌లు మన దేశ పరిస్థితులకు అనుకూలంగా లేకపోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే స్థానికంగా తయారుచేసిన బ్యాటరీ సెల్ లోనే వినియోగించుకోవాలని ఆయన చెప్పారు.

అధిక ఉష్ణోగ్రతలకు అనుకూలంగా బ్యాటరీ సెల్‌లను వాటిని రూపొందించకపోవడం, నాణ్యత లేమి కారణంగా పేలుడు వంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. అధిక ఉష్ణోగ్రత కలిగిన స్థానిక పరిస్థితులను తట్టుకుని ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఇప్పటికే కొన్ని దేశాలు అధిక ఉష్ణోగ్రతల వద్ద పనిచేసే సెల్‌లను అభివృద్ధి చేశాయన్నారు. మరోవైపు విదేశాలనుంచి దిగుమతి చేసుకునే బ్యాటరీల విషయంలో పకడ్బందీ స్క్రీనింగ్ వ్యవస్థతోపాటు కఠినమైన టెస్టింగ్ విధానాలూ అమలు చేయాలని సూచించారు. ఈవీలలో నెంబర్‌ వన్‌గా మారేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను పేలుడు ఘటనలు దెబ్బతిస్తాయని వివరించారు.

Need To Set Up Own Manufacturing Unit As Imported Cells Not Suitable For Indian Climate (1)

Need To Set Up Own Manufacturing Unit As Imported Cells Not Suitable For Indian Climate

ఈ ప్రమాదాలు ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగంపై ప్రభావం చూపుతాయన్నారు. ఈవీ బ్యాటరీలపై పేలుడు ఘటనలపై అధికారులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో… నిపుణుల ప్యానెల్ నివేదికను సమర్పించింది. లోపాలు కలిగిన అన్ని ఈవీ వాహనాలను రీకాల్ చేయడానికి ఆదేశాలు జారరీ చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో, ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు) అగ్నికి ఆహుతైన సంఘటనలు జరిగాయి. ఫలితంగా మరణాలతోపాటు ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. బ్యాటరీ టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీగా పేర్కొన్నారు.

ప్రస్తుతం భారత్ బ్యాటరీ సెల్‌లను తయారు చేయడం లేదన్నారు. మన స్వంత సెల్ తయారీ ప్లాంట్‌లను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మనం ఏ సెల్‌ను తయారు చేసినా అది భారతీయ పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి (ఉష్ణోగ్రత) అని సరస్వత్ చెప్పారు. గత నెలలో, పుణెలో రైడ్-హెయిలింగ్ ఆపరేటర్ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆర్మ్‌లో మంటలు చెలరేగడంతో ప్రభుత్వం ప్రారంభించిన ఈ-స్కూటర్‌పై విచారణకు ఆదేశించింది. EVలు మంటల్లో చిక్కుకున్న సంఘటనలపై దర్యాప్తు చేసేలా నివారణ చర్యలను సూచించాలని సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (CFEES)ని కోరినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Read Also : Nitin Gadkari : EV కంపెనీలకు మంత్రి గడ్కరీ హెచ్చరిక.. భద్రత లోపిస్తే భారీ మూల్యం తప్పదు..!