P Chidambaram: మోదీకే ఇది సాధ్యం: దేశంలో విద్యుత్ కొరతపై కాంగ్రెస్ నేత పీ.చిదంబరం వ్యంగ్యాస్త్రాలు
దేశంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై స్పందిస్తూ చిదంబరం శనివారం వరుస ట్వీట్లతో మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు

Chidambara,
P Chidambaram: దేశంలో మోదీ ఉంటే ఏదైనా సాధ్యమేనని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పీ.చిదంబరం ఛలోక్తులు విసిరారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై స్పందిస్తూ చిదంబరం శనివారం వరుస ట్వీట్లతో మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బొగ్గు రైళ్లను తరలించేందుకు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి..కేంద్ర ప్రభుత్వం భలే ఉపాయంతో ముందుకు వచ్చిందంటూ చిదంబరం ఎద్దేవా చేశారు. ఈ అంశంపై భాజపా ప్రభుత్వంపై విరుచుకుపడిన చిదంబరం, “దేశంలో సమృద్ధిగా ఉన్న బొగ్గు నిల్వలు, ప్రపంచంలోనే అతి పెద్ద రైలు నెట్వర్క్, నిరుపయోగమైన థర్మల్ ప్లాంట్ల సామర్థ్యం. అయినప్పటికీ, నేడు తీవ్రమైన విద్యుత్ కొరత ఉంది. ఇందుకు మోదీ ప్రభుత్వాన్ని నిందించలేము. దీనికి కారణం 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన!” “బొగ్గు, రైల్వే లేదా విద్యుత్ మంత్రిత్వ శాఖలలోనూ అసమర్థత లేదు. గతంలో కాంగ్రెస్ చెప్పిన శాఖల మంత్రులపై నిందలు మాత్రమే ఉన్నాయి!” అని కాంగ్రెస్ నేత చిదంబరం ట్వీట్ చేశారు.
Also read:Rainfall In May : ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం – IMD
“బొగ్గు కొరతను తీర్చేందుకు ప్రభుత్వం సరైన పరిష్కారాన్ని కనుగొంది: ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయండి మరియు బొగ్గు ట్రైన్స్ నడపండి! మోడీ హై, ముమ్కిన్ హై” అని చిదంబరం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మరోవైపు దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. దీంతో డిమాండ్ కు సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. దేశ అవసరాలకు సరిపోయే దాదాపు 70 శాతం విద్యుత్ థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తి అవుతుంది. అయితే బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Abundant coal, large rail network, unutilised capacity in thermal plants. Yet, there is acute power shortage
Modi Government cannot be blamed. It is because of 60 years of Congress rule!
— P. Chidambaram (@PChidambaram_IN) April 30, 2022