Mohan Bhagwat : భారత్‌లో కుటుంబ వ్యవస్థ గురించి మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలు

భారత సంస్కృతిని దెబ్బతీసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. కొందరు స్వార్థపరులు తమ ప్రాపంచిక సుఖాలను నెరవేర్చుకోవాలని..దానికి పరిస్థితులను వారికి అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తున్నారు అంటూ మోహన్ భగత్ ఆరోపించారు.

Mohan Bhagwat : భారత్‌లో కుటుంబ వ్యవస్థ గురించి మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలు

Mohan Bhagwat

Updated On : September 6, 2023 / 6:27 PM IST

Family system Mohan Bhagwat : ప్రపంచ వ్యాప్తంగా కుటుంబ వ్యవస్థ క్షీణించిపోతోంది అంటూ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(Rashtriya Swayamsevak Sangh) (RSS) చీఫ్‌ మోహన్‌ భగ్‌వత్‌ (Mohan Bhagwat)వ్యాఖ్యానించారు. మంగళవారం (సెప్టెంబర్ 5,2023) మహారాష్ట్ర( Maharashtra)లోని నాగ్‌పుర్‌ (Nagpur) లో సీనియర్ సిటిజన్ లను ఉద్ధశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ వ్యవస్థ గురించి ప్రస్తావించారు.

ప్రపంచ వ్యాప్తంగా కుటుంబ వ్యవస్థ నానాటికీ క్షీణిస్తోందని.. కానీ భారత్ మాత్రం అటువంటి పరిస్థితి నుంచి తప్పించుకుందని అన్నారు. భారత సంస్కృతి సత్యం అనే పునాదిపై ఆధారపడి అందుకే భారత్ లో కుటుంబ వ్యవస్థ బాగుందని అన్నారు. కానీ కొంతమంది మన సంస్కృతిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆరోపించారు. కొందరు స్వార్థపరులు తమ ప్రాపంచిక సుఖాలను నెరవేర్చుకోవాలని..దానికి పరిస్థితులను వారికి అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

సాంస్కృతిక మార్క్సిజం (cultural Marxism)పేరుతో తమ స్వార్థ సిద్ధాంతాలను సమర్థించుకుంటున్నారని అన్నారు.ఈ ప్రభావం భారత్ తో సహా ఇతర దేశాలపై కూడా ఉందన్నారు.కానీ..భారత్ సత్యం అనే పునాదిపై ఉంది. మన మూలాలు ఎంతో దృఢమైనవన్నారు.

ఇలాంటి అనైతికానికి మద్దతిస్తూ సమాజంలో గందరగోళానికి కారణమవుతారని, తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవచ్చనే ఆలోచనతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని.. తమ సిద్ధాంతాల ద్వారా సత్యాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారు అంటూ ఆరోపించారు.