Kerala: అదాని ప్రాజెక్టుపై మత్స్యకారుల ఆగ్రహం.. ఉద్రిక్తత

నిర్మాణ పనులు ప్రారంభమైన నాటి నుంచి వందల ఎకరాలు నాశనం అయ్యాయని, అలాగే తమ ఉపాధి కోల్పోతున్నట్లు మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వందలాది మత్స్యకారులు నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు. తిరువనంతపురం ప్రధాన ఓడరేపు వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఓడరేపు ప్రధాన గేటు వద్ద పోలీసులు భారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఆందోళన కారులు భారీకేడ్లను దాడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు

Kerala: అదాని ప్రాజెక్టుపై మత్స్యకారుల ఆగ్రహం.. ఉద్రిక్తత

Fishermen break Police barricades as their protest against the ongoing Adani port project in Vizhinjam

Kerala: కేరళలో నిర్మిస్తోన్న అదాని పోర్టు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానిక మత్స్యకారులు చేపట్టిన ఆందోళన ఉద్రక్తతకు దారి తీసింది. నిరసనకారులను అడ్డుకునేందుక పోలీసులు భారీ ఎత్తున భారీకేడ్లు ఏర్పాటు చేయగా.. ఆందోళన చేపట్టిన మత్స్యకారులు వాటిని దాటుకుని ముందుకు వెళ్లారు. పోలీసులకు నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. అదానీ పోర్టు నిర్మాణం ద్వారా తాము నిరాశ్రాయులమవుతున్నామని, తమకు శాశ్వత ప్రాతిపదికన ప్రత్యామ్నాయం చూపించాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

విజింజం సముద్ర తీరంలో అదాని పోర్టు నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు ప్రారంభమైన నాటి నుంచి వందల ఎకరాలు నాశనం అయ్యాయని, అలాగే తమ ఉపాధి కోల్పోతున్నట్లు మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వందలాది మత్స్యకారులు నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు. తిరువనంతపురం ప్రధాన ఓడరేపు వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఓడరేపు ప్రధాన గేటు వద్ద పోలీసులు భారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఆందోళన కారులు భారీకేడ్లను దాడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపనున్నట్లు సమాచారం.

మంగళవారం మత్స్యకారుల నిరసనలు లాటిన్ ఆర్చ్ డియోసెస్ సంస్థ నేతృత్వంలో వారి చర్చ్‌లలో నల్లజెండాలు ఎగురవేయడంతో ప్రారంభమయ్యాయి. విజింజం ఛలో నినాదంతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు ఓడరేవు ప్రధాన ద్వారం వద్దకు చేరుకోనున్నారు. మరోవైపు యువకులు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ నిరసన కేవలం తిరువనంతపురంలోని మత్స్యకార సంఘం సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలకే పరిమితం కాదని లాటిన్ ఆర్చ్ డియోసెస్ సంస్థకు చెందిన ఫాదర్ మోన్సిగ్నోర్ యూగిన్ హెచ్ పెరీరా తెలిపారు.

Hyderabad: ఒంటికి నిప్పంటించుకుని ప్రిన్సిపాల్‪‌ను పట్టుకున్న విద్యార్థి.. ఇద్దరికీ గాయాలు