Ira Basu : ఫుట్‌పాత్ పైనే జీవనం.. దయనీయ స్థితిలో మాజీ సీఎం మరదలు

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య మరదలు అత్యంత దయనీయ స్థితిలో ఫుట్‌పాత్‌పై కనిపించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.నెరిసిన జుట్టు, పాతబడిన డ్రెస్సు, ఫుట్‌పాత్‌పై న

Ira Basu : ఫుట్‌పాత్ పైనే జీవనం.. దయనీయ స్థితిలో మాజీ సీఎం మరదలు

Ira Basu

Ira Basu : పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య మరదలు అత్యంత దయనీయ స్థితిలో ఫుట్‌పాత్‌పై కనిపించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. నెరిసిన జుట్టు, పాతబడిన డ్రెస్సు, ఫుట్‌పాత్‌పై నిద్ర, వీధి వ్యాపారులు పెట్టే ఆహారం తింటూ గడుపుతున్న ఆమె మాజీ సీఎం మరదలని తెలిసి అందరూ షాక్ కి గురయ్యారు. బుద్ధదేవ్‌ భట్టాచార్య పదేళ్ల పాటు బెంగాల్‌ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన భార్య మీరా. ఆమె సోదరే ఇరా బసు.

OnePlus: వన్ ప్లస్ నుంచి రూ.20వేల కంటే తక్కువ ధర ఫోన్లు

పదేళ్లు రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించి, పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో కీలక నేతగా వెలుగొందిన వ్యక్తి భార్య చెల్లెలు అంటే డాబు దర్పంతో ఉంటుందని అనుకుంటే పొరపాటే. ఫుట్‌పాత్‌పై భిక్షమెత్తుకుంటున్న దౌర్భాగ్యపు పరిస్థితి ఆమె. పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా బరాబజార్‌ ప్రాంతంలోని దున్లాప్‌లో మాసిపోయిన దుస్తుల్లో ఇరా బసు కనిపించింది. ఫుట్‌పాత్‌పైనే ఆమె జీవనం గడుపుతున్న దుస్థితి.

ఇరా బసు వైరాలజీలో పీహెచ్‌డీ చేసింది. అద్భుతంగా ఇంగ్లీష్, బెంగాలీ మాట్లాడగలదు. అంతేకాదు రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నీస్‌ క్రీడాకారిణి. క్రికెట్‌లో కూడా రాష్ట్రస్థాయిలో ఆడింది. అలాంటి ఇరా రెండేళ్లుగా ఫుట్‌పాత్‌పై నివసిస్తోంది. 1976లో ప్రియానాథ్‌ బాలిక స్కూల్ లో టీచర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఇరా బసు 2009లో పదవీ విరమణ పొందింది.

Realme Pad : రియల్‌మి నుంచి ఫస్ట్ Tablet.. ఫీచర్లు కిరాక్, ధర ఎంతంటే?

ఆమె టీచర్‌గా ఉన్నప్పుడు బావ బుద్ధదేవ్‌ భట్టాచార్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో బరానగర్‌లో ఉంటున్న ఆమె ఖర్దాలోని లిచూ బగాన్‌కు మకాం మార్చింది. కొన్నాళ్లకే ఏమైందో గానీ ఆమె పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు దున్లాప్‌లోని ఫుట్‌పాత్‌పై జీవనం సాగిస్తోంది.

ఇరా బసు పనిచేసిన ప్రియానాథ్ స్కూల్ ప్రధానోపాధ్యాయిని కృష్ణకాళి దీనిపై స్పందించారు. ఇరా బసు ఇక్కడే పాఠాలు బోధించేవారని తెలిపారు. రిటైర్‌మెంట్ తర్వాత ఆమెకు రావాల్సిన పెన్షన్‌కు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని కోరినా స్పందించలేదన్నారు. దీంతో ఆమె పెన్షన్ పొందలేకపోతున్నారని వివరించారు.

ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబర్ 5న డన్‌లప్ ఆర్గనైజేషన్ అయిన ‘ఆర్టియజోన్’ సభ్యులు ఆమెను పూలమాలతో సత్కరించి స్వీట్లు తినిపించారు.
ఆ సందర్భంగా ఇరాబసు మాట్లాడుతూ.. టీచర్లందరూ తనను ఇంకా ఇష్టపడుతున్నారని, చాలామంది విద్యార్థులకు తానింకా గుర్తున్నానని చెప్పింది. వారిలో కొందరు తనన హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపింది. ఇరా బసుకు ఇతర స్కూళ్ల నుంచి అవకాశాలు వచ్చినా ఆమె ప్రియానాథ్ బాలికల పాఠశాలను వదిలి వెళ్లలేదు. అక్కడే ఏకంగా 34 సంవత్సరాల పాటు పనిచేసింది.

బుద్ధదేవ్ భట్టాచార్య కుటుంబంతో ఉన్న బంధుత్వంపై ఇరా బసు మాట్లాడుతూ.. టీచర్ గా కెరీర్ ను ప్రారంభించిన సమయంలో బుద్ధదేవ్‌తో ఉన్న బంధుత్వాన్ని ఉపయోగించుకోవాలనుకోలేదు. నా శక్తియుక్తులనే ఉపయోగించుకున్నా. తమ కుటుంబాల మధ్య బంధుత్వం అందరికీ తెలిసిందే అయినా తాను వీఐపీ ఐడెంటిటీని కోరుకోలేదని వెల్లడించింది.

కాగా, మాజీ సీఎం మరదలు ఇరా బసు ఫుట్‌పాత్‌పై నివసిస్తున్నారన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించారు. అంబులెన్స్‌లో ఆమెను కోల్‌కతా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.