Vinay Dube : విమానయాన సంస్థ నెలకొల్పే యోచనలో మాజీ జెట్ ఎయిర్ వేస్ సీఈవో

కొత్త విమానయాన సంస్థను నెలకొల్పే ప్రయత్నాల్లో మాజీ జెట్ ఎయిర్ వేస్ సీఈవో వినయ్ దూబే ఉన్నారు.

Vinay Dube : విమానయాన సంస్థ నెలకొల్పే యోచనలో మాజీ జెట్ ఎయిర్ వేస్ సీఈవో

Former Jet Airways CEO

Former Jet Airways CEO : కొత్త విమానయాన సంస్థను నెలకొల్పే ప్రయత్నాల్లో మాజీ జెట్ ఎయిర్ వేస్ సీఈవో వినయ్ దూబే ఉన్నారు. 2021 సంవత్సరంలో లాంచ్ చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఈయన జెట్ ఎయిర్ వేస్, గో ఎయిర్ వేస్ లకు పనిచేశారు. తోటి సహచరులు నిఖిల్ వేద్, ప్రవీణ్ అయ్యర్ లతో దీనిని స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నారు. విమాన తయారీ దారుల్లో పేరొందిన ఎయిర్ బస్, బోయింగ్ సంస్థలతో ఇప్పటికే చర్చలు జరిపారు. సంవత్సరానికి ఐదు విమానాలతో కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు.

దీనిని అధికారికంగా ప్రకటించలేదు కానీ…పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు టాక్. ఇందుకోసం చాలా గ్రౌండ్ వర్క్ చేసినట్లు, నిధుల సమీకరణ, పెట్టుబడి దారుల కోసం ఓ బృందం చూస్తోందని తెలుస్తోంది. ఇక దూబే విషయానికి వస్తే…ఎయిర్ లైన్స్ తో కలిసి పనిచేసిన దూబే ను 2017లో జెట్ సీఈవోగా నియమితులయ్యారు. 2019, మే 14వ తేదీన వినయ్ దూబే రాజీనామా చేశారు. జెట్ ఎయిర్ వేస్ సీఎఫ్ అమిత్ అగర్వాల్ రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే వినయ్ దూబే రాజీనామా చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

జెట్ ఎయిర్‌వేస్ సంస్థ 2019 ఏప్రిల్ 17 నుంచి ఎటువంటి ఆపరేషన్స్‌ను కూడా కొనసాగించని సంగతి తెలిసిందే. క్రూడ్ ఆయిల్ ధరల్లో ఆటుపోట్లు, ఆకర్షణీయమైన తక్కువ చార్జీలకే కొన్ని ఎయిర్‌లైన్స్ నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీ, రూపాయి బలహీనపడటం వంటి కారణాలతో జెట్ ఎయిర్‌వేస్ తీవ్ర నష్టాల భారిన పడింది.