Uttar Pradesh: దళితులు పొలంలో అడుగుపెడితే 50 చెప్పు దెబ్బలు, రూ.5వేలు జరిమానా అంటూ దండోరా

పొలంలోకి దళిత కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఎవరైనా అడుగుపెడితే 50 చెప్పు దెబ్బలు, రూ.5వేలు జరిమానా కట్టాల్సిందేనంటూ దండోరా వేయించాడు ఆ ఊరి మాజీ పెద్ద. సోషల్ మీడియాలో ఈ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు దృష్టికి వెళ్లింది.

Uttar Pradesh: దళితులు పొలంలో అడుగుపెడితే 50 చెప్పు దెబ్బలు, రూ.5వేలు జరిమానా అంటూ దండోరా

maoists arrest

Uttar Pradesh: సమాజం ఎంత ముందుకుపోతున్నా దళితులపై వివక్ష అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. ముజఫర్ నగర్ లోనూ ఇదే దారుణం కనిపించింది.

తన పొలంలోకి దళిత కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఎవరైనా అడుగుపెడితే 50 చెప్పు దెబ్బలు, రూ.5వేలు జరిమానా కట్టాల్సిందేనంటూ దండోరా వేయించాడు ఆ ఊరి మాజీ పెద్ద. సోషల్ మీడియాలో ఈ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు దృష్టికి వెళ్లింది.

జిల్లాలోని చార్తావాల్ ప్రాంతంలోని పావ్తీ ఖుర్ద్ గ్రామంలో దళితుల ఇళ్ల ముందు దండోరా వేస్తుండగా.. తీసిన వీడియో వైరల్ అయింది.

మాజీ గ్రామ పెద్ద అయిన రాజ్‌బీర్ త్యాగి.. కున్వర్‌పాల్‌ను తన పొలంలో పనిచేసేందుకు నిరాకరించారు. దళితులు ఆగ్రహంతో పనుల్లోకి వెళ్లేందుకు రాకపోవడంతో తన పొలంలోకి ఇక అడుగపెట్టకూడదంటూ నిషేదిస్తూ దండోరా వేయించారు.

Read Also: ఉడుకుతున్న ఉత్తరప్రదేశ్…పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి

విషయం పోలీసులకు తెలియడంతో పలు సెక్షన్లు ప్రకారం కేసు ఫైల్ చేశారు. అట్రాసిటీల నిరోధక చట్టం నిబంధనలను కూడా కేసులో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

2015లో ఫైరింగ్ లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ విక్కీ త్యాగి కొడుకే రాజ్‌బీర్ త్యాగి. విక్కీ త్యాగి 2011 బర్కలి కేసులో ఒకే కుటుంబంలోని ఎనిమిది మందిని చంపిన నిందితుల్లో ఒకడు.