Dog Bit A Child: చిన్నారిని కుక్క కరిచినా పట్టించుకోని యజమాని.. రూ.5వేలు ఫైన్.. వీడియో వైరల్

బాలుడిని కరిచిందో పెంపుడు కుక్క. బాధతో ఆ బాలుడు విలవిల్లాడుతున్నా సరే.. ఆ మహిళ ఏమాత్రం పట్టించుకోలేదు. కాస్సేపటి తర్వాత కుక్కను తీసుకుని వెళ్లిపోయింది. దీనిపై బాలుడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళ నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Dog Bit A Child: చిన్నారిని కుక్క కరిచినా పట్టించుకోని యజమాని.. రూ.5వేలు ఫైన్.. వీడియో వైరల్

Dog Bit A Child: ఒక మహిళకు చెందిన పెంపుడు కుక్క, ఆమె పక్కనుండగానే చిన్నారిని కరిచింది. బాధతో ఆ చిన్నారి అరుస్తుంటే ఆ మహిళ ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది.

Jasmine Price: ఆకాశాన్నంటిన మల్లెపూల ధరలు.. కిలో రూ.3వేలు.. ఎందుకింత రేటు

దీనిపై బాధిత చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్, రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని చార్మ్స్ క్యాజిల్‌లో ఈ నెల 5న సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. స్కూలు నుంచి ఇంటికి వస్తున్న ఒక బాలుడు లిఫ్ట్‌లోకి వెళ్లాడు. అదే సమయంలో ఒక మహిళ, తన పెంపుడు కుక్కతో అదే లిఫ్ట్‌లోకి వచ్చింది. దీంతో బాలుడు కుక్కకు దూరంగా జరిగాడు. కానీ, కుక్క బాలుడి తొడపై కరిచింది. దీంతో బాధతో విలవిలలాడుతూ బాలుడు ఏడుస్తున్నా సరే ఆ మహిళ తనకేం పట్టనట్లుగా అలాగే ఉండిపోయింది. తర్వాత కుక్కను తీసుకుని వెళ్లిపోయింది. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులతోపాటు, మున్సిపల్ అధికారులు కూడా ఈ ఘటనపై స్పందించారు.

AP Cabinet Meeting: సీఎం జగన్ అధ్యక్షతన నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం.. మూడు రాజధానుల అంశంపై చర్చ

మహిళ ఇంటికి చేరుకున్న అధికారులు ఆ కుక్కను రిజిష్టర్ చేయించకపోవడంతో రూ.5వేల జరిమానా విధించారు. ఘటనకు సంబంధించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యంలో లిఫ్ట్‌లోని సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఘటనలో ఉన్న మహిళపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన కుక్క కరిచి బాలుడు విలవిల్లాడుతున్నప్పటికీ ఆమె కనీసం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.