Jasmine Price: ఆకాశాన్నంటిన మల్లెపూల ధరలు.. కిలో రూ.3వేలు.. ఎందుకింత రేటు

తమిళనాడులోని మధురైలో మల్లెపూల ధరలు విపరీతంగా పెరిగాయి. కేజీ రూ.3,000 వరకు ధర పలుకుతున్నాయి. ఇవి అరుదైన రకానికి చెందిన మల్లెపూలు. అలాగే ఇతర పూల ధరలు కూడా భారీగా పెరిగాయి.

Jasmine Price: ఆకాశాన్నంటిన మల్లెపూల ధరలు.. కిలో రూ.3వేలు.. ఎందుకింత రేటు

Jasmine Price: తమిళనాడులోని మధురైలో మల్లెపూల ధరలు ఆకాశాన్ని తాకాయి. కేజీ మల్లె పూల ధర రూ.3 వేల వరకు పలుకుతోంది. మల్లె పూలే కాకుండా, ఇతర పూల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఇటీవలి భారీ వర్షాల కారణంగా పూల దిగుబడి తగ్గింది.

AP Cabinet Meeting: సీఎం జగన్ అధ్యక్షతన నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం.. మూడు రాజధానుల అంశంపై చర్చ

దీంతో మార్కెట్లో పూలు అవసరమైన స్థాయిలో దొరక్కపోవడంతో పూల ధరలకు రెక్కలొచ్చాయి. మధురైలో మల్లె పూల ధరలు ఈ స్థాయిలో ఉండేందుకు కారణం ఉంది. మధురై మల్లెపూలు అరుదైన రకానికి చెందినవి. తమిళనాడులో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పూలు రెండు రోజుల వరకు మొగ్గగా, తాజాగా ఉంటాయి. చాలా ఆలస్యంగా ఈ పూలు వాడిపోతాయి. అందుకే ఈ పూలకు మార్కెట్లో డిమాండ్ చాలా ఎక్కువ. అయితే, ఇంతకుముందు ఈ పూల ధరలు కేజీకి రూ.1,500 వరకు మాత్రమే ఉండేవి. వినాయక చవితి నేపథ్యంలో ధర భారీగా పెరిగింది. మంగళవారం ఉదయం డిమాండ్ పెరగడంతో కిలో మల్లెపూలు కేజీ రూ.3,000కు అమ్ముడయ్యాయి.

Meeting On CPS: సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో నేడు ఏపీ మంత్రిమండలి చర్చలు

అలాగే ఇతర పూల ధరలు కూడా భారీగా పెరిగాయి. కనకాంబరం పూలు కిలో రూ.1,000 వరకు అమ్ముడయ్యాయి. రోజా పూలు, సంపంగి, చామంతి వంటి పూల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వర్షాల కారణంగా పూల దిగుబడి తగ్గడం, వినాయక చవితి సందర్భంగా డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. దీంతో పూలు కొనాలనుకునే వారికి ఈ ధరలు షాక్ ఇస్తున్నాయి.