Meeting On CPS: సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో నేడు ఏపీ మంత్రిమండలి చర్చలు

సీపీఎస్ అంశంపై నేడు ఉద్యోగ సంఘాలతో ఏపీ మంత్రుల కమిటీ భేటీ కానుంది. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీని స్థానంలో జీపీఎస్‌కు అంగీకరించాలని ప్రభుత్వం కోరుతోంది.

Meeting On CPS: సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో నేడు ఏపీ మంత్రిమండలి చర్చలు

Meeting On CPS: సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాలతో నేడు ఏపీ మంత్రిమండలి చర్చలు జరపనుంది. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. 16 ఉద్యోగ సంఘాలకు మంత్రుల కమిటీ ఆహ్వానం పంపింది.

BiggBoss 6 Day 2 : రెండో రోజే డైరెక్ట్‌గా ముగ్గురు నామిషన్స్‌లోకి.. హడావిడి చేసిన గీతూ.. ఓవర్ యాక్షన్ అంటున్న నెటిజన్లు..

సీపీఎస్ రద్దు చేయాలంటూ కొంతకాలంగా ఉద్యోగ సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. అయితే, దాని స్థానంలో జీపీఎస్ ప్రవేశపెట్టి, ఒప్పించేందుకు ప్రభుత్వం విఫలయత్నం చేస్తోంది. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ జీపీఎస్‌కు అంగీకరించబోమని ఉద్యోగ సంఘాలు తేల్చిచెప్పాయి. జీపీఎస్ ద్వారా తమకు అన్ని విధాలా నష్టం జరుగుతుందని, ఈ విధానాన్ని అంగీకరించబోమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. పాత పెన్షన్ విధానమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిలో ఎలాంటి రాజీపడబోమని చెప్పాయి. ఈరోజు జరిగే మంత్రిమండలి సమావేశంలో ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటారు. సీపీఎస్ నిధులను ఇప్పటివరకు ఎంఎస్‌డీఎల్‌కు డిపాజిట్ చేయలేదని ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

Kakinada Kendriya Vidyalaya Incident : కాకినాడ కేంద్రీయ విద్యాలయ ఘటన.. ఆ స్ప్రే వల్లే ఇలా జరిగిందా?

సీపీఎస్‌ అంశంపై ఇప్పటికే మంత్రుల కమిటీ అనేక దఫాలుగా చర్చలు జరిపింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పలుసార్లు చర్చలు జరిపినప్పటికీ విఫలమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల ఒకటో తేదీన ఛలో విజయవాడ, సీఎం కార్యాలయం ముట్టడికి ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. కానీ, అనివార్యమైన పరిస్థితుల్లో ఈ ఆందోళనను ఉద్యోగ సంఘాలు వాయిదా వేసుకున్నాయి. నేడు మంత్రుల కమిటీ భేటీ తర్వాత ఉద్యోగ సంఘాలు సీపీఎస్ అంశంపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాయి.