AP Cabinet Meeting: సీఎం జగన్ అధ్యక్షతన నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం.. మూడు రాజధానుల అంశంపై చర్చ

ఏపీ మంత్రివర్గ సమావేశం బుధవారం జరగనుంది. ఏపీలోని సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఉదయం పదకొండు గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. సీపీఎస్ రద్దు, మూడు రాజధానుల అంశంపై చర్చిస్తారు.

AP Cabinet Meeting: సీఎం జగన్ అధ్యక్షతన నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం.. మూడు రాజధానుల అంశంపై చర్చ

AP Cabinet Meeting: ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది. బుధవారం ఉదయం పదకొండు గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తారు.

Meeting On CPS: సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో నేడు ఏపీ మంత్రిమండలి చర్చలు

ప్రధానంగా మూడు రాజధానులు, సీపీఎస్ అంశంపై చర్చించే అవకాశం ఉంది. వీటితోపాటు దేవాదాయ శాఖలో ఈవోల నియామకానికి సంబంధించి రెవెన్యూ అధికారులను నియమించే అంశంపై చర్చిస్తారు. అలాగే శాసన సభలో 85 ఆదరణ పోస్టుల మంజూరుపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎయిడెడ్ విద్యాసంస్థలు, గ్రంథాలయ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి 62 సంవత్సరాలకు పదవీ విరమణ పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ క్లబ్స్ పాలసీలో చేసిన మార్పులను మంత్రివర్గం ఆమోదించనుంది. పంచాయతీరాజ్ శాఖలో గతంలో ఇచ్చిన వివిధ జీవోలను ఆమోదిస్తారు.

BiggBoss 6 Day 2 : రెండో రోజే డైరెక్ట్‌గా ముగ్గురు నామిషన్స్‌లోకి.. హడావిడి చేసిన గీతూ.. ఓవర్ యాక్షన్ అంటున్న నెటిజన్లు..

వచ్చే నెలలో అమలు చేయనున్న జగనన్న చేయూత పథకం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘గడపగడపకు మన ప్రభుత్వం’ అమలవుతున్న తీరుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.