ఓటు వేసిన గోవా, చత్తీస్ గఢ్ సీఎంలు

  • Published By: veegamteam ,Published On : April 23, 2019 / 07:38 AM IST
ఓటు వేసిన గోవా, చత్తీస్ గఢ్ సీఎంలు

లోక్‌సభ మూడో దశ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో పలు రాష్ట్రాల సీఎంలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంట్లో భాగంగా గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ సతీమణితో కలిసి నార్త్‌ గోవా జిల్లాలోని పాలె పట్టణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఛత్తీస్ గఢ్ సీఎం  భూపేష్ బాగెల్ దుర్గ్ లో ఏర్పాటు చేసిన 3వ ఫేజ్ 55వ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..మా పార్టీ తరపును ప్రజలకు చెప్పాల్సింది చెప్పామనీ..ఇక ఎన్నికల్లో తమ ఓటు ద్వారా ప్రజలు ఎవర్ని గెలిపించాలో వారే నిర్ణయించుకుంటారని ప్రజలే అసలైన న్యాయమూర్తిలని  అన్నారు. 
 

కాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఒడిశాలోని తాల్చేర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో మాజీ ఐఏఎస్‌ అధికారి భువనేశ్వర్‌ భాజపా అభ్యర్థి అపరిజిత సారంగి నగరంలోని గవర్నమెంట్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. యూపీ మాజీ సీఎం సమాజ్ వాద్ పార్టీ గౌరవాధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ సైఫాయి, మెయిన్పురిలో పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.