కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 531లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు ప్రకటన

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 531లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు ప్రకటన

Government: కేంద్రం 531లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంది. ఖరీఫ్ పంట కాలంలో 70లక్షల మంది రైతుల నుంచి కొనాలని చూస్తుంది. లక్ష కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయనుండగా.. కొత్త రైతు చట్టాల కోసం ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులకు సహాయం చేసినట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ అక్టోబర్ నుంచి మొదలుకానుంది.

ఎమ్ఎస్పీ స్కీం కింద ప్రస్తుత ఖరీఫ్ సీజన్ 2020-21 కాలంలో పంటలకు సహాయం వర్తిస్తుంది. జనవరి 8 నాటికి ధాన్యం సేకరణ దాదాపు 531.22 లక్షల టన్నులకు చేరుతుందని. సంవత్సర కాలంలో అది 26శాతం పంటకు సమానం.

ప్రస్తుతం నడుస్తోన్న కేఎమ్ఎస్ సేకరణ ఆపరేషన్స్ లో భాగంగా.. 70.35లక్షల మంది రైతులు ఆల్రెడీ బెనిఫిట్ పొందారు. లక్షా 294కోట్ల ఎమ్ఎస్పీ వ్యాల్యూకు సరిపడ కొనుగోలు అయింది. మొత్తం కొనుగోలు చేసిన ధాన్యం 531.22లక్షల టన్నులు ఉండగా.. పంజాబ్ 202.77లక్ష టన్నులుగా ఉంది.

జనవరి 8 నాటికి 82లక్షల 19వేల 567 కాటన్ బేల్స్ (24లక్షల కోట్లు రూపాయలు విలువ) ను లక్షా 60వేల 518రైతుల నుంచి కొనుగోలు చేయనున్నారు. ప్రధానంగా పంజాబ్, హర్యానా నుంచి వేల మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పలు ప్రాంతాల్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

శుక్రవారం కేంద్ర మంత్రులు, రైతు సంఘం నాయకులకు మధ్య ఎనిమిదో దఫా చర్చలు తర్వాత కూడా మూడు చట్టాలపై వెనుకడుగేసేది లేదని చెప్పారు. ఈ క్రమంలో జనవరి 15న మరోసారి మీటింగ్ జరగనుంది.