మంత్రి కొడుక్కి వార్నింగ్ ఇచ్చిన మహిళా కానిస్టేబుల్ సంచలన వ్యాఖ్యలు

  • Published By: madhu ,Published On : July 16, 2020 / 11:46 AM IST
మంత్రి కొడుక్కి వార్నింగ్ ఇచ్చిన మహిళా కానిస్టేబుల్ సంచలన వ్యాఖ్యలు

Lockdown నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి కుమారుడికి వార్నింగ్ ఇచ్చిన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన…గుజరాత్ మహిళా కానిస్టేబుల్ సునీతా యాదవ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా చేసిన అనంతరం..తిరిగి లాఠీతో వస్తానని, IPS గా ముందుకొస్తానని స్పష్టం చేశారు. ఓ జాతీయ ఛానెల్ తో ఆమె పలు విషయాలు వెల్లడించారు.

పొలిటికల్స్, పోలీసు అధికారుల విధుల గురించి పలు వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా ఆమోదించిన అనంతరం అన్ని విషయాలను ప్రజల ముందు పెడుతానని, తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కొనడానికి తాను సిద్దమని కూడా ప్రకటించారు.

అందరూ ‘లేడీ సింగం’ అంటున్నారు..కానీ..సాధారణ లోక్ రక్షక్ దళ్ (గుజరాత్ పోలీసు విభాగం) అధికారిణిని..అన్నారు. అబద్ధం అనేది ఉద్యోగానికి సంబంధించి ర్యాంకులో ఉందని, అందుకే తాను IPSకు ప్రిపేర్ కావాలని అనుకుంటున్నానని, సరైన ర్యాంకు లేకపోవడం వల్ల తనను నమిలేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్నట్లు, ఐపీఎస్ గా మారి మళ్లీ పోలీసు శాఖలోకి వస్తానని..అది సాధ్యం కాకపోతే LLB చేస్తాను..కాకపోతే..జర్నలిస్టు అవుతానన్నారు. మంత్రి అనుచరుల నుంచి తనకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలన్నారు.

తనకు ఫోన్ లో బెదిరింపులు వస్తున్నాయని, ఎక్కువ కాలం జీవిస్తారని అనుకోవడం లేదన్నారు. సమస్యను పరిష్కరించకుంటే..రూ. 50 లక్షలు ఇస్తామని తనకు రాయబారం కూడా పంపారని సునీతా యాదవ్ తెలిపారు.