Gurmeet Ram Rahim Singh: డేరా బాబాకు బెయిల్.. 40 రోజుల పెరోల్‌పై విడుదల కానున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్

డేరా బాబాగా పేరు పొందిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‪కు తాజాగా మరోసారి బెయిల్ లభించింది. ఈ సారి ఆయన 40 రోజులు పెరోల్‌పై విడుదల కానున్నారు. ఈ ఏడాది ఇలా పెరోల్‌పై విడుదల కావడం ఇది మూడోసారి.

Gurmeet Ram Rahim Singh: డేరా బాబాకు బెయిల్.. 40 రోజుల పెరోల్‌పై విడుదల కానున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్

Gurmeet Ram Rahim Singh: అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబాకు బెయిల్ లభించింది. ప్రస్తుతం ఆయన హరియాణాలోని సనారియా జైలులో ఖైదీగా ఉన్నారు.

Parathas: పరాటాలపై 18 శాతం జీఎస్టీ.. బ్రిటీష్ వాళ్లు కూడా పన్ను వేయలేదన్న కేజ్రీవాల్

అయితే, ఆయనకు 40 రోజుల పెరోల్ లభించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. డేరా బాబా తన సిర్సా ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2017, ఆగష్టులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది. దీంతో ఆయన ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత జూన్‌లో కూడా ఆయన పెరోల్‌పై విడుదలయ్యారు. తాజాగా మరోసారి ఆయనకు బెయిల్ లభించింది. అది కూడా అదంపూర్ ఉప ఎన్నికకు ముందే ఆయనకు బెయిల్ లభించడం విశేషం.

Munugodu: ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం.. 100కు పైగా అభ్యర్థులు.. ప్రధాన పార్టీల అభ్యర్థులు వీళ్లే

గత ఏడాది ఆయన మూడు సార్లు పెరోల్ పొందగా, ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు పెరోల్ మీద బయటకు వచ్చారు. ఇది ఈ ఏడాది మూడవసారి. సగటున ఏడాదికి 90 రోజులు పెరోల్ మీద జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. డేరా బాబాపై అత్యాచార ఆరోపణలతోపాటు, హత్యా నేరం కింద కూడా కేసులు నమోదయ్యాయి.