GST Collection: జనవరి నెలలో భారీగా జీఎస్టీ వసూళ్లు.. ఇప్పటి వరకు రెండో భారీ వసూళ్లు ఇవే ..

జీఎస్టీ వసూళ్లలో కేంద్ర ప్రభుత్వం రెండో అతిపెద్ద వసూళ్లను సాధించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2023 జనవరి నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను వెల్లడించింది. మంగళవారం సాయంత్రం 5గంటల సమయానికి 1,55,922 కోట్ల స్థూల జీఎస్టీ వసూళ్లు సాధించింది.

GST Collection: జనవరి నెలలో భారీగా జీఎస్టీ వసూళ్లు.. ఇప్పటి వరకు రెండో భారీ వసూళ్లు ఇవే ..

GST Collection

GST Collection: జీఎస్టీ వసూళ్లలో కేంద్ర ప్రభుత్వం రెండో అతిపెద్ద వసూళ్లను సాధించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2023 జనవరి నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను వెల్లడించింది. మంగళవారం సాయంత్రం 5గంటల సమయానికి 1,55,922 కోట్ల స్థూల జీఎస్టీ వసూళ్లు ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని ఆర్జించింది. ఇప్పటి వరకు జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన నాటినుంచి అతిపెద్ద రెండో ఆదాయం ఇదేకాటం గమనార్హం. గతేడాది ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.1.68లక్షల కోట్ల జీఎస్టీ వసూలు సాధించింది.

GST collections: 26 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. సెప్టెంబర్‌లో రూ.1.47 లక్షల కోట్లు వసూలు

2022 డిసెంబర్ నెలలో 1,49,507 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. సీజీఎస్టీ కింద రూ. 28,963కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ. 36,730 కోట్లు వసూలు అయ్యాయి. అదేవిధంగా ఐజీఎస్టీ కింద రూ. 79,599 కోట్లు వసూళ్లయ్యాయి. ఐజీఎస్టీ మొత్తంలో వస్తువుల దిగమతులపై పన్నురూపంలో రూ. 37, 118 కోట్లు వసూలు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ట్వీట్ ప్రకారం.. జనవరి నెలలో జీఎస్టీ వసూళ్లు ఇప్పటి వరకు జీఎస్టీ వసూళ్లలో రెండో అతిపెద్ద వసూళ్లుగా నిలిచి రికార్డు బద్దలు కొట్టినట్లు తెలిపారు.

ఇదిలాఉంటే ప్రభుత్వం గణాంకాల ప్రకారం.. 10,630 కోట్లు ప్రభుత్వం సెస్‌గా వసూలు చేసింది. అయితే, ఇందులో వస్తువుల దిగుమతిపై సర్ ఛార్జీగా రూ. 768 కోట్లు రికవరీ చేశారు. ఇదిలాఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి 2023 నెల వరకు వచ్చే ఆదాయాలు గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన జీఎస్టీ ఆదాయం కంటే 24శాతం ఎక్కువ. నెలాఖరు వరకు జీఎస్టీ రిటర్న్ లు (జీఎస్టీఆర్ -3బీ), ఇన్ వాయిస్‌ల స్టేట్మెంట్ (జీఎస్టీఆర్ -1) దాఖలు శాతం సంవత్సరాల్లో గణనీయంగా మెరుగుపడిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 2022 అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికంలో, గత ఏడాది ఇదే త్రైమాసికంలో 2.19 కోట్లతో పోలిస్తే వచ్చే నెలాఖరు వరకు మొత్తం 2.42 కోట్ల జీఎస్టీ రిటర్న్ లు దాఖలు చేయబడినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.