Delhi Metro: ఢిల్లీ మెట్రోలో యువకుడి అసభ్యకర ప్రవర్తన.. తలదించుకొని వెళ్లిపోయిన మహిళలు.. కేసు నమోదు

ఓ యువకుడు మెట్రోలో అసహ్యంగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో యువకుడుపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో యువకుడి అసభ్యకర ప్రవర్తన.. తలదించుకొని వెళ్లిపోయిన మహిళలు.. కేసు నమోదు

Delhi Metro

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో కొందరు అసభ్యకర ప్రవర్తనతో తోటి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత రెండు రోజుల క్రితం సెక్రటేరియట్ నుంచి హెచ్‌సీసీ వైపు వెళ్లే మెట్రోలో ఒక వ్యక్తి తన ప్యాంట్ ని విప్పాడు. అతని ప్రవర్తనతో మెట్రోలోని తోటి ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలి కాలంలో కేవలం లో దుస్తుల్లో ఓ వ్యక్తి మెట్రోలో ప్రయాణించాడు. ఆ సమయంలో మెట్రోలో ప్రయాణించేందుకు మహిళా ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. ఇలా తరచూ ఢిల్లీ మెట్రోలో కొందరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు.

Man Fathered 550 Children : 550 మంది పిల్లలకు తండ్రి అయిన వ్యక్తికి షాకిచ్చిన కోర్టు .. రూ.కోటి జరిమానా

తాజాగా ఓ యువకుడు మెట్రోలో అసహ్యంగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో యువకుడు చేసిన పనిని ప్రతీఒక్కరూ ఛీదరించుకుంటున్నారు. ఈ వీడియో ప్రకారం.. ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న యువకుడు హస్తప్రయోగం చేసుకోవటంతో పక్కనే ఉన్న ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ స్పందించారు. ఇది పూర్తిగా అసహ్యకరమైంది, బాధాకరమైంది. ఇలాంటి పని ఆరోగ్యకరమైంది కాదు.. అనారోగ్యకరమైనది. ఈ అవమానకరమైన చర్యపై సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవాలని నేను ఢిల్లీ పోలీసులకు, ఢిల్లీ మెట్రోకు నోటీసు జారీ చేస్తున్నాను అని పేర్కొంది.

IPL 2023: లక్నో జట్టు‌కు షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌కు గాయం.. తరువాత మ్యాచ్ ఆడేది అనుమానమే..

ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) కూడా ప్రయాణీకులు బాధ్యతతో నడుచుకోవాలని ఒక ప్రకటన విడుదల చేసింది. మెట్రోలో ప్రయాణిస్తున్న సమయంలో బాధ్యతాయుతంగా నడుచుకోవాలని కోరుతున్నాం. ఇతర ప్రయాణీకులు ఏదైన అభ్యంతరకర ప్రవర్తనను గమనించినట్లయితే. వారు వెంటనే కారిడార్, స్టేషన్, సమయం మొదలైన వివరాలతో డీఎంఆర్‌సీ హెల్ప్‌లైన్‌లో విషయాన్ని తెలియజేయాలని కోరింది.  ఇదిలాఉంటే.. మెట్రోలో యువకుడు తాజా అసభ్యకర ప్రవర్తనపై ఢిల్లీ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఐపీపీ సెక్షన్ 294 (అశ్లీల చర్యలు) కింద కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.