Mashroom park : దేశంలోనే మొట్టమొదటి పుట్టగొడుగుల పార్కు

భారత్‌లో మొట్టమొదటిసారిగా పుట్టగొడుగుల పార్కు ప్రారంభించారు. దీన్నే క్రిప్టోగ్రామ్స్‌ పార్కు అని కూడా అంటారు. క్రిప్టోగ్రామ్స్‌ అంటే పురాతన మొక్కలు అని అర్థం.దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌ దేవవనంలో సముద్రమట్టానికి 9 వేల అడుగుల ఎత్తులో మూడు ఎకరాల విస్తీర్ణయంలో ఈ పార్కును నిర్మించారు.

Mashroom park : దేశంలోనే మొట్టమొదటి పుట్టగొడుగుల పార్కు

Mashroom (cryptogamic) Park

Mashroom (Cryptogamic) park : భారత్‌లో మొట్టమొదటిసారిగా పుట్టగొడుగుల పార్కు ప్రారంభించారు. దీన్నే క్రిప్టోగ్రామ్స్‌ పార్కు అని కూడా అంటారు. క్రిప్టోగ్రామ్స్‌ అంటే పురాతన మొక్కలు అని అర్థం.దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్, డెహ్రాడూన్‌లో ఆదివారం (జులై 11,2021) ప్రారంభించారు. ఈ పార్క్‌లో దాదాపు 50 రకాల క్రిప్టోగ్రామ్స్‌ జాతులు ఉండటం మరో విశేషం. ఈ పార్క్‌ నిర్మాణం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దేవవనంలో సముద్రమట్టానికి 9 వేల అడుగుల ఎత్తులో మూడు ఎకరాల విస్తీర్ణయంలో ఈ పార్కును నిర్మించారు.

క్రిప్టోగ్రామ్స్‌ అంటే పురాతన మొక్కలు అని అర్థం. ఇవి రాక్షసబల్లుల (డైనాసార్స్ కాలం) నుంచి భూమిపై ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ మొక్కలు కాలుష్యం ఉన్నచోట పెరగవు. పరిశుభ్రమైన వాతావరణంలోనే పెరుగుతాయట. అంటే అవి ఉండే ప్రాంతం..అంటే పెరిగే ప్రాంతం పరిశుభ్రమైనది అని అనుకోవచ్చు. ఈ మొక్కల్లో మరో ప్రత్యేకత ఏమిటంటే..ఇవి విత్తనాల ద్వారా ఎదిగే మొక్కలు కావు. అంటే ఇవి ఆల్గే, ఫెర్న్, ఫింగీ వంటివి. మనకు తెలియని విషయం మరొకటి ఏంటంటే..ఈ పుట్టగొడుగుల్లో వీటిలో మంచి ఆరోమా ఉంటుంది. వంటకాల్లో కూడా వీటిని వాడతారు.

వీటిలో లిచెన్స్‌ పుట్టగొడుగుల్ని హైదరాబాద్‌ బిర్యానీల్లో వాడుతుంటారు. అలాగే కూరలు, కుర్మాల్లో కూడా వాడతారు. వీటిని ఔషధాల్లో కూడా వాడుతారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ప్రజలకు ఈ మొక్కలు ప్రాధాన్యత గురించి తెలియజేయటానికే ఈ పార్క్‌ ఏర్పాటు చేశామని అడవుల పరిశోధనాధికారి, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ సంజీవ్‌ చతుర్వేది తెలిపారు.

ముఖ్యంగా ఆల్గేల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. చాలా మాసెస్‌ జాతి మొక్కల్లో యాంటీ–ఫంగల్‌ గుణాలున్నాయి. దేవవనం. ఈ పేరే ఓ ప్రత్యేకత. ఎందుకంటే పేరుకు తగినట్లుగానే దేవవనం కాలుష్యానికి ఆమడ దూరంలో ఉంటుంది. ఇక ఇక్కడ ఉండే తేమతో కూడిన వాతావరణం ఈ పునాతన మొక్కలు చక్కగా ఎదగటానికి వాటి అభివృద్ధికి కలిసి వస్తుందని..అందుకే ఈ పార్క్‌ను ఇక్కడ ఏర్పాటు చేశామనీ..తెలిపారు. ఎందుకంటే పరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ పురాతన మొక్కలు అవేనండీ పుట్టగొడుగులు పెరుగుతాయి.